ETV Bharat / state

కూటమి ప్రభుత్వంలో జోరందుకున్న నియామకాలు - ఉత్సాహంగా పాల్గొన్న అభ్యర్థులు - Campus Placements in vijayawada - CAMPUS PLACEMENTS IN VIJAYAWADA

Campus Placements at PB Siddhartha College in Vijayawada : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కళాశాలల్లో ప్రాంగణ నియామకాలు జోరందుకుంది. ఎపీఎన్ఆర్టీ, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ నియామకాలకు అభ్యర్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. యువతీ, యువకులు ప్రాంగణ నియామకాలకు పెద్దఎత్తున తరలివచ్చారు.

Campus Placements
Campus Placements (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 9:41 AM IST

Campus Placements at PB Siddhartha College in Vijayawada : ఉద్యోగమేళా, ప్రాంగణ నియామాకాలు గత ఐదేళ్లుగా ఏపీలో ఎక్కడా వినిపించని పదాలు ఇవి. ఉపాధి కోసం యువత ఊరు విడిచి హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లి సొంతంగానే పని వెతుక్కోవాల్సి వచ్చింది. ఇంజినీరింగ్, డిగ్రీ పట్టాలు పొందినా ఉద్యోగాలు ఇచ్చే వారు లేక నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రాంగణ నియామకాల్లో కదలిక వచ్చింది. దీంతో విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు.

వైఎస్సార్​సీపీ నేతల నిర్వాకం - బడిని కబ్జా చేసి బ్యాంకులో తాకట్టు పెట్టారు - Govt School Acquisition

ప్రాంగణ నియామకాలకు విశేష స్పందన : విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో ఎంఎన్​సీ (MNC) సంస్థ జెన్‌ఫ్యాక్ట్‌ నిర్వహించిన ప్రాంగణ నియామకాలకు విశేష స్పందన లభించింది. వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాన్-ఐటీ పోస్టులకు నిర్వహించిన ఆన్ లైన్ పరీక్షలు, రాతపరీక్షలకు మంచి స్పందన కనిపించింది. ఎన్​ఆర్​టీ విభాగం, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నియామక ప్రక్రియ అభ్యర్థుల్లో కొత్త ఆశలు రేకెత్తించింది. సుమారు 350 మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా వీరందరికీ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు, రాతపరీక్షల ద్వారా సామర్థ్యాలను లెక్కించారు. ప్రతిభ చూపిన వారికి నియామక పత్రాలు అందించనున్నారు. నాన్-ఐటీ సెక్టార్‌లో పోస్టులకు ఈ ప్రాంగణ నియామకాలు చేపట్టారు. ఒక్కసారిగా పరీక్షలు, ఇంటర్వ్యూలు అనేసరికి అభ్యర్థుల్లో సరికొత్త ఉత్సాహం కన్పించింది.

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒకే చట్టం - సవరణ చేయనున్న కూటమి ప్రభుత్వం - Common Universities Act in AP

ప్రాంగణ నియామకాలు జోరందుకునే సూచనలు : దాదాపు ఐదేళ్ల తర్వాత ఏపీ ఎన్​ఆర్​టీ, ఏపీ ఎస్​డీసీ విభాగాలు సంయుక్తంగా ఈ ప్రాంగణ నియామకాలు చేపట్టాయి. ఇంగ్లీష్ భాషపై పట్టు, భావవ్యక్తీకరణ నైపుణ్యాలకు ఇంటర్వ్యూలో ప్రాధాన్యమిచ్చారు. ఈ దిశలోనే అభ్యర్థులు ప్రాంగణ నియామకాలకు కసరత్తు చేయాలని నిపుణులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో రాష్ట్రంలో పరిస్థితులన్నీ మారిపోయాయి. వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు తరలిరావడంతోపాటు మరికొన్ని సంస్థలు విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో కళాశాలల్లో మళ్లీ ప్రాంగణ నియామకాలు జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కూడా ఈ దిశగా శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

వైఎస్సార్సీపీ అనాలోచిత నిర్ణయం - పూర్తి కాని జాతీయ విశ్వవిద్యాలయాల నిర్మాణాలు - National Institutes in ap

ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి రాని ఆర్వో ప్లాంట్లు - విద్యార్థులకు బోరు నీరే గతి! - students suffer drinking water

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.