ETV Bharat / state

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒకే చట్టం - సవరణ చేయనున్న కూటమి ప్రభుత్వం - Common Universities Act in AP

Common Universities Act Coming Soon in AP : ఏపీలోని విశ్వ విద్యాలయాలన్నింటికీ కలిపి ఒకే చట్టాన్ని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి భారీగా సవరణలు చేయనుంది. ఈ చట్ట సవరణ చేసే బాధ్యత ఉన్నత విద్యామండలికి ప్రభుత్వం అప్పగించింది.

university act ap
university act ap (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 8:01 AM IST

Common Universities Act Coming Soon in AP : విద్యార్థులకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేలా విశ్వవిద్యాలయాలు అన్నిటినీ ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వేర్వేరు చట్టాలున్న యూనివర్శిటీలను చట్టసవరణ ద్వారా ఒకే చట్టం పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వర్శిటీల పాలకమండళ్ల స్థానంలో బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ను తెచ్చి పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసేందుకు సిద్ధమైంది. ఆర్జీయూకేటీ కులపతిగా గవర్నర్‌కే బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తోంది.

ఒకే చట్టం దిశగా అడుగులు : విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతవిద్యను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేయనుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలో 20 విశ్వవిద్యాలయాలు ఉండగా వీటికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి. వీటన్నింటిని కలిపి ఒకే చట్టంగా మార్చేందుకు చట్ట సవరణచేసే బాధ్యతను ఉన్నత విద్యామండలికి ప్రభుత్వం అప్పగించింది. డిసెంబరులోపు కొత్త చట్టం రూపొందించాలని ఆదేశించింది.

అందినకాడికి దోచుకున్నారు - అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు - Nuziveedu IIIT present situation

సీఎం స్థానంలో మళ్లీ గవర్నర్​ : ఆర్జీయూకేటీ, పద్మావతి మహిళ, ద్రవిడ, జేఎన్‌టీయూ, క్లస్టర్, ఉర్దూ విశ్వవిద్యాలయాలకు వేర్వేరు చట్టాలున్నాయి. మిగిలిన సాధారణ విశ్వవిద్యాలయాలకు ఒక చట్టం అమల్లో ఉంది. వీటిని ఒకే చట్టం పరిధిలోకి తీసుకొస్తే ఏపీ విశ్వవిద్యాలయాల చట్టంగానే పరిగణిస్తారు. ట్రిపుల్‌ఐటీల (IIIT) కోసం రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేక చట్టం ఉంది. అన్ని వర్సిటీలకు గవర్నర్‌ కులపతి కాగా ఈ వర్సిటీకి మాత్రం కులపతిని ప్రభుత్వమే నియమిస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఈ చట్టానికి సవరణ చేసి కులపతిగా సీఎం ఉండేలా మార్పు చేశారు. చట్ట సవరణకు గవర్నర్‌ ఆమోదం లభించినప్పటికీ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ కాలేదు. ఇప్పుడు రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయానికి గవర్నర్‌ కులపతిగా ఉండేలా చట్ట సవరణ చేసే అవకాశం ఉంది.

వైఎస్సార్సీపీ అనాలోచిత నిర్ణయం - పూర్తి కాని జాతీయ విశ్వవిద్యాలయాల నిర్మాణాలు - National Institutes in ap

పారిశ్రామికవేత్తలకు సభ్యత్వం : విశ్వవిద్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (EC-Executive Council) స్థానంలో కొత్తగా బోర్డు ఆఫ్‌ గవర్నర్స్‌ను తీసుకురానున్నారు. పారిశ్రామికవేత్తలను సభ్యులుగా నియమించేలా చట్ట సవరణ చేయనున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల కోర్సుల్లో మార్పులు, చేర్పులు, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకుస్తోంది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చట్టాన్ని పూర్తిగా మార్చాలని సర్కార్‌ భావిస్తోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి రాని ఆర్వో ప్లాంట్లు - విద్యార్థులకు బోరు నీరే గతి! - students suffer drinking water

కమిషన్​ చట్టానికీ సవరణ : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, గతంలో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిషన్‌ ఏఎఫ్​ఆర్​సీని (AFRC) ఏర్పాటు చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో దీన్ని కమిషన్‌గా మార్చి కళాశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. సాంకేతిక, ప్రొఫెషనల్‌ కోర్సులకు ఏఎఫ్​ఆర్​సీ ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా ఇప్పుడు డిగ్రీ కళాశాలల ఫీజులను కూడా కమిషన్‌ నిర్ణయిస్తోంది. విద్యాసంస్థల పర్యవేక్షణను వర్సిటీలు, ఉన్నత విద్యామండలి చేస్తుండగా కమిషన్‌ సైతం ఇదే పని చేస్తోంది. వీటి మధ్య సమన్వయం లేదని గుర్తించిన కూటమి ప్రభుత్వం చట్టానికి సవరణ చేయాలని నిర్ణయించింది.

ఆ వైద్య కళాశాలలో సీట్లు ఇక లోకల్​ విద్యార్థులకే- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ జీవో - Dental College Seats

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.