ETV Bharat / state

రాష్ట్ర ఖజానాకు లక్ష కోట్ల ఆదాయం - కాగ్‌ నివేదికలో వెల్లడి - తెలంగాణ కాగ్ రిపోర్ట్ 2023 టు 2024

CAG Report Telangana Finance 2023-2024 : తెలంగాణ రెవెన్యూ రాబడులు, వ్యయం గణనీయంగా పెరిగినట్లు కాగ్‌ వెల్లడించింది. మూడు త్రైమాసికాల్లో రాష్ట్ర ఖజానాకు రూ.1,61,000ల కోట్ల ఆదాయం సమకూరింది. అందులో పన్నుల రాబడి లక్ష కోట్ల వరకు ఉంది. నవంబర్‌లో పన్నుల రాబడి తగ్గగా డిసెంబర్‌లో రూ.12,000ల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. పన్నేతర ఆదాయం రూ.20,000ల కోట్లకు పైగా ఉండగా కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.5000ల కోట్లకు మించలేదు. డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,56,000ల కోట్లకు పైగా వ్యయం చేసింది.

CAG Report on telangana
CAG Report on telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2024, 8:15 AM IST

రాష్ట్ర రెవెన్యూ రాబడులు వ్యయంపై కాగ్‌ నివేదిక

CAG Report on Telangana Finance 2023-2024 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో రాష్ట్ర ఖజానాకు బడ్జెట్ అంచనాలో 57 శాతానికి పైగా ఆదాయం సమకూరింది. డిసెంబర్ వరకు ఆదాయ, వ్యయాల వివరాలను కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్ (Telangana Finance) ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.2,16,566 కోట్ల రెవెన్యూ రాబడి అంచనా వేయగా డిసెంబర్ నెలాఖరు వరకు రూ.1,25,002 కోట్ల ఆదాయం సమకూరింది.

CAG Report on Telangana 2023 : అందులో పన్ను ఆదాయం రూ.99,693 కోట్లు. పన్నుల రూపంలో రూ.1,52,499 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. 2023 సంవత్సరం చివరి వరకు అందులో 65 శాతానికిపైగా ఖజానాకు చేరింది. జీఎస్టీ ద్వారా రూ.34,147 కోట్లు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.10,654 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.22,251 కోట్లు సమకూరాయి. ఎక్సైజ్ పన్నుల రూపంలో రూ.16,500 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.10,252 కోట్లు, ఇతర పన్నుల రూపంలో మరో రూ.5885 కోట్లు ఖజానాకు చేరాయి.

Cag Report on Telangana: నష్టాల్లో 16 ప్రభుత్వ రంగ సంస్థలు: కాగ్

CAG Report on Telangana Taxes : బడ్జెట్ అంచనాల్లో ఎక్సైజ్ పన్నులు 82 శాతాన్ని (Telangana Taxes) అందుకున్నాయి. ముందు నెలలతో పోలిస్తే నవంబర్‌లో పన్ను ఆదాయం తగ్గింది. డిసెంబర్‌లో తిరిగి పుంజుకొని గణనీయంగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం అత్యధికంగా ఆగస్టులో రూ.12,729 కోట్లు రాగా, డిసెంబర్‌లో రూ.12,609 కోట్లు ఖజానాకు సమకూరింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం రూ.20,331 కోట్లు వచ్చింది. బడ్జెట్ అంచనా అయిన రూ.22,808 కోట్లలో 89 శాతానికి పైగా ఉంది. ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం చాలా తక్కువగా ఉంది. డిసెంబర్ నాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం రూ.4978కోట్లు మాత్రమే. ఈ ఏడాది గ్రాంట్ల రూపంలో ఏకంగా రూ.41,259 కోట్లు వస్తాయని అంచనా వేసినా డిసెంబర్ వరకు వచ్చింది కేవలం 12 శాతం మాత్రమే.

CAG Report on State Finance: బడ్జెట్‌ నిర్వహణ తీరు బాగోలేదు.. కాగ్‌ ఆక్షేపణ

ఇప్పటికే 95 శాతానికి పైగా అప్పు : అప్పుల విషయానికి వస్తే మూడు త్రైమాసికాలు ముగిసే నాటికి తీసుకున్న రుణాల మొత్తం రూ.36,536 కోట్లు (Telangana Debts). బడ్జెట్‌లో ప్రతిపాదించిన రూ.38,234 కోట్లలో ఇప్పటికే 95 శాతానికి పైగా అప్పు తీసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరి నాటికి అన్ని రకాలుగా రూ.1,61,565 కోట్లు ఖజానాకు సమకూరాయి. ప్రభుత్వం చేసిన ఖర్చు మొత్తం రూ.1,56,078 కోట్లు. అందులో రెవెన్యూ వ్యయం రూ.1,24,679 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.31,399 కోట్లు. వడ్డీల చెల్లింపుల కోసం రూ.16,998 కోట్లు, వేతనాలకు రూ.29,337 కోట్లు వ్యయం చేశారు. పెన్షన్లకు రూ.12,489 కోట్లు, రాయితీలపై రూ.6679 కోట్లు ఖర్చు పెట్టారు.

CAG Report On Telangana : 'ఐదేళ్లలో తొలిసారి రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదు'

CAG Report: మిషన్​కాకతీయతో తెలంగాణలో పెరిగిన భూగర్భ జలమట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.