ETV Bharat / state

ఈ నెల 18న రాష్ట్ర కేబినెట్ సమావేశం - రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లతో పాటు కీలక అంశాలపై చర్చ - Telangana Cabinet meeting

Cabinet meeting in Telangana 2024 : ఈ నెల 18న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ మధ్య అపరిష్కృతమైన అంశాలపై రాష్ట్ర మంత్రులు చర్చించనున్నారు. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ చర్చించనుంది. వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై చర్చించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన హామీలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Telangana Ministers Meeting 2024
Cabinet meeting in Telangana 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 9:01 PM IST

Updated : May 15, 2024, 10:08 PM IST

Cabinet meeting in Telangana 2024 : ఈనెల 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ మధ్య పెండింగులో ఉన్న పునర్విభజన అంశాలపై కేబినెట్​లో చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా చర్చించాలని సీఎం నిర్ణయించారు. జూన్ 2తో రాష్ట్రం ఏర్పడిన పదేళ్లు పూర్తి కానున్నందన పునర్విభజన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజన, ఇప్పటి వరకు పరిష్కరించినవి, పెండింగులో ఉన్న అంశాలు, తదితర వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Discussion in the Cabinet on partition Guarantees : రాష్ట్ర విభజన చట్టం ప్రకారం షెడ్యూలు 9, 10లో ఉన్న సంస్థల విభజన పూర్తి కాలేదని పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని అధికారులు సీఎంకు వివరించారు. విద్యుత్ సంస్థల బకాయిల వివాదం తేలలేదని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. తదుపరి కార్యచరణపై చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్న ఉద్యోగుల బదిలీ వంటివి ముందుగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది - ఇక పరిపాలనపై ఫోకస్ : సీఎం రేవంత్ - CM Revanth Reddy Chit Chat
CM on Telangana State Separation Guarantees : రెండు రాష్ట్రాల మధ్య క్లిష్టంగా మారిన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. పదేళ్లు పూర్తయ్యాక హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండదని, ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతన్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష - CM Revanth Reddy Review Meeting

Last Updated : May 15, 2024, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.