ETV Bharat / state

టూరిజంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు- మేథోమదనంలో ఏపీ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ - GOVT SUPPORT TO BUSINESS IN AP

ఏపీ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో బిజినెస్‌ ఎక్స్‌పో - పెట్టుబడిదారుల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ప్రోత్సాహకాలు

Business Expo Organized by AP Chamber of Commerce in Vijayawada
Business Expo Organized by AP Chamber of Commerce in Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2024, 2:25 PM IST

Business Expo Organized by AP Chamber of Commerce in Vijayawada : పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడం ద్వారా ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు ఇచ్చే రాయితీలన్నీ వర్తించి కొత్త ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని అధికారులు పేర్కొన్నారు. పర్యాటక రంగంలో ఉత్తేజం నింపే కొత్త విధానం ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం పొందింది. త్వరలోనే కొన్ని మార్పులు, చేర్పుల తర్వాత అమల్లోకి వస్తుందని ఔత్సాహికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాఫీ, చాక్లేట్ ఫెస్టివల్స్‌ నిర్వహణ ద్వారా యువతను పర్యాటకంగా ఆకట్టుకునే అంశాల వైపు ప్రభుత్వం దృష్టి సారిస్తోందని విజయవాడలో నిర్వహిస్తోన్న ఏపీ బిజినెస్‌ ఎక్స్‌పో నిపుణులు అభిప్రాయపడ్డారు.

Business EXPO 2024 in Vijayawada : విజయవాడ ఎస్​ఎస్ కన్వెన్షన్‌లో ఏపీ ఛాంబర్ ఆఫ్‌ కామర్స్‌ నిర్వహిస్తోన్న బిజినెస్‌ ఎక్స్‌పోలో రెండో రోజు తయారీ, పర్యాటకం, ఆతిధ్యం, మౌలిక వసతులు, మహిళా సాధికారతపై ప్రత్యేక సదస్సులు జరిగాయి. 25 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా కొత్త పర్యాటక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, తద్వారా 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. పెట్టుబడిదారుల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. కొత్త పర్యాటక విధానం ద్వారా రాష్ట్ర స్థూల ఆదాయంలో 4.6 శాతం నుంచి 8 శాతానికి పెంపు నిర్దేశిత లక్ష్యంగా ఉందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో దేశంలో మొదటి 10 స్థానాల్లో రాష్ట్రానికి చోటు కల్పించాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా ఈ రంగం నిపుణులు తెలిపారు.

విజయవాడలో బిజినెస్‌ ఎక్స్‌పో - ఆకట్టుకుంటున్న పారిశ్రామిక విధానాలు

మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడంతో పాటు యువతలోని ప్రతిభను వెలికితీసి, వారికి అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు వీలుగా ప్రత్యేక గణన జరుగుతోందని, ఇది కొత్త అంకుర సంస్థల స్థాపనకు వీలు కలిపిస్తుందని నిపుణులు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానాల్లో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించడం ఆహ్వానించదగిన పరిణామమని, ఇదే సమయంలో జిల్లా పరిశ్రమ కేంద్రాల రూపురేఖలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ ఎక్స్‌పోలో 160 స్టాళ్లు ఏర్పాటు చేశారు. 40 కొబ్బరి ఉప ఉత్పత్తులతో తీర్చిదిద్దిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నందున ఈ రంగంలోనూ కొత్తగా స్టార్టప్‌లు ఏర్పాటు చేసి యువ ఔత్సాహికులు ఉపాధి మార్గాలను స్థిరం చేసుకుంటున్నారు.

వినూత్న స్థానిక ఉత్పత్తులకు ఈ ఎక్స్‌పోలో ప్రత్యేక స్థానం కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన అనేక వస్తువులను ప్రదర్శనలో ఉంచారు.

అదిరిపోయిన 'ఫుడ్‌ బిజినెస్‌' - ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ఆసక్తి - Food Business Expo in vijayawada

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.