ETV Bharat / state

'నన్ను నమ్మండి నాన్న - నేను ఏ తప్పు చేయలేదు' - లెటర్ రాసి యువతి సూసైడ్ - Young Woman Suicide In AP

Young Woman Suicide In AP : ఆ యువతి ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతోంది. తాను అన్నగా భావించే ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. అప్పుడు ఆమె కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో అతను యువతి తండ్రికి కాల్ చేశాడు. దీన్ని అపార్థం చేసుకున్న తండ్రి ఆమెను మదలించాడు. ఇది అవమానకరంగా భావించిన యువతి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీలోని మాచర్లలో జరిగింది.

BTech Student Committed Suicide in Macherla
Young Woman Suicide In AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 10:55 AM IST

Updated : Aug 6, 2024, 2:50 PM IST

BTech Student Committed Suicide in Macherla : నేటి కాలంలో చాలా మంది యువత చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రేమ విఫలమైందని ఒకరు, పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు, తల్లిదండ్రులు మందలించారని ఇంకొందరు. ఇలా వివిధ కారణలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న తల్లిందండ్రులను విషాదంలోకి నెట్టేస్తున్నారు.

అకారణంగా తనను తండ్రి మందలించాడని భావించిన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లలో చోటు చేసుకుంది. తాను అన్నగా భావించే వ్యక్తి పంచిన అనురాగాన్ని తన తండ్రి అపార్థం చేసుకోవడంతో తట్టుకోలేకపోయింది. దానికి చావే పరిష్కారమని తలచిన యువతి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Young Woman Suicide In AP
మృతురాలు రాసిన సూసైడ్ లెటర్ (ETV Bharat)

Woman Suicide in AP : నంద్యాల జిల్లా కృష్ణగిరి మండలానికి చెందిన జక్కి గౌరప్ప, రామేశ్వరి దంపతులు డోన్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద కుమార్తె రేణుక యల్లమ్మ (22) మాచర్లలోని న్యూటన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ (CSE) రెండో సంవత్సరం చదువుతోంది. వేసవి సెలవులు ముగించుకొని ఇటీవల కళాశాలకు తిరిగి వెళ్లింది. ఆమెను చెల్లెలిగా చూసుకునే ఓ అబ్బాయి ఆదివారం సాయంత్రం ఫోన్‌ చేశాడు. ఆ సమయంలో రేణుక పనిలో ఉండి స్పందించలేదు.

ఈ క్రమంలోనే రేణుక ఫోన్‌ తీయడం లేదని ఆ అబ్బాయి ఆమె తండ్రి గౌరప్పకు ఫోన్‌ చేసి చెప్పాడు. ఆగ్రహానికి గురైన ఆయన కుమార్తెకు ఫోన్‌ చేసి మందలించాడు. కాలేజీలో చదువుకునే అమ్మాయిలకు అబ్బాయిలతో పనేంటి? అతనెందుకు ఫోన్‌ చేస్తున్నాడు? ఈ విషయాన్ని కళాశాలలో తేలుస్తానంటూ ఊగిపోయాడు. ఆమె ఎంత చెప్పినా తండ్రి వినలేదు. సోమవారం తెల్లవారేసరికి కళాశాలకు వస్తాననడంతో రేణుక భయపడింది.

తండ్రి కాలేజీకి వస్తే జరిగే పరిణామాలను ఊహించుకుంటూ రేణుక భయపడిపోయింది. తన మరణంతోనే సమస్య తీరుతుందని భావించింది. ఈ క్రమంలోనే తాను ఏ తప్పూ చేయలేదని ఉత్తరం రాసి హాస్టల్​లో ఖాళీగా ఉన్న గదిలో ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇది గమనించిన తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి గౌరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య - కొనసాగుతున్న గాలింపు చర్యలు

ప్రేమ వేధింపులు తాళలేక మైనర్ బాలిక ఆత్మహత్య - Minor suicide Due love harassment

Last Updated : Aug 6, 2024, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.