BRS Telangana Decade Celebrations 2024 : దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నాయకులు బీఆర్ఎస్ కార్యాలయాల్లో ముగింపు వేడుకలు నిర్వహిస్తున్నారు. జాతీయ జెండా, పార్టీ జెండాలను ఎగరవేసి సమావేశాలు నిర్వహించి పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రయాణాన్ని స్మరించుకున్నారు. ఆసుపత్రుల్లో రక్తదానాలు, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.
సిద్దిపేట జిల్లాల రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన వారిని మాజీమంత్రి హరీశ్‌రావు సన్మానించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు సందర్బంగా సిద్దిపేట బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగురవేశారు. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందని ఈ కలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని హరీశ్ రావు అన్నారు.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలన్న పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఆనాడు జిల్లావ్యాప్తంగా చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగురవేశారు. కొన్ని దశాబ్దాల పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందని ఈ కలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని హరీశ్ రావు అన్నారు.
BRS MLA Harish On Telangana Movement : సిద్దిపేట లేకుంటే కేసీఆర్ లేరని కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని హరీశ్ రావు పేర్కొన్నారు. 1969 ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి సిద్దిపేట బిడ్డలు రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఉద్యమ సమయంలో సిద్ధారెడ్డి , రమణాచారి, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, దేవి ప్రసాద్, రామలింగారెడ్డిల సేవలు మరువలేనివని వారిని గుర్తుంచుకోవడం మన కర్తవ్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా సేవ చేసిన వారిని గుర్తుంచుకోవడం నిజమైన పండుగని తెలిపారు. తెలంగాణ ఉద్యమం గతంలో చాలా సార్లు విఫలమైందన్న హరీశ్ ఉద్యమానికి, కేసీఆర్‌కు సిద్దిపేట బిడ్డలు కుడి భుజంగా నిలిచారని వ్యాఖ్యానించారు.
Telangana decade Celebrations 2024 : మరోవైపు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యాలయంలో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి జెండావిష్కరణ చేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్నో పథకాలు తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
నాలుగో తేదీన అసలైన ఫలితాలు వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా : కేటీఆర్ - KTR On EXIT Polls 2024