BRS Protest Against LRS in Telangana 2024 : రాష్ట్ర సర్కార్ ఎల్‌ఆర్‌ఎస్‌పై చేసిన ప్రకటనతో బీఆర్‌ఎస్ భగ్గుమంది. గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ దళం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని పేదలకు ఉచితంగా చేసిపెట్టాలని ఆందోళనలు నిర్వహించింది. హైదరాబాద్ అమీర్ పేటలోని హెచ్‌ఎండీఏ (HMDA) కార్యాలయం వద్ద మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఖరిపై ధర్నా నిర్వహించారు. వినతి పత్రంతో పాటు వెయ్యి మంచి నీళ్ల బాటిళ్లను తలసాని సాయి కిరణ్ అధికారులను ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు.
Congress Free LRS : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు అలవి కాని హామీలు ఇచ్చి ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని చెప్పారని ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠాగోపాల్‌లు ఆరోపించారు. ప్రజలపై భారం మోపితే ఊరుకోబోమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ మాజీ, ప్రస్తుత ప్రతినిధులు సహా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై బీఆర్ఎస్ పోరు - నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
"కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎల్‌ఆర్ఎస్‌ను ఉచితంగా చేస్తామని ప్రకటించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంకు డబ్బులు వసులు చేసే ఉద్ధేశ్యం లేదు. ఉంటే అధికారంలో ఉన్నప్పుడే వసూలు చేసే వాళ్లం. మార్చి 31 వరకు విధించిన గడువు వల్ల 25 లక్షల కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. వెంటనే తిరిగి రోల్‌బ్యాక్ చేయాలని కోరుతున్నాం."-తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి
Thalasani Srinivas Yadav : జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లోనూ బీఆర్‌ఎస్ (BRS) నేతలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ (LRS) ద్వారా ప్రజల రక్తం తాగుతున్నారన్న వారే మళ్లీ దాని అమలుకు యత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సతీశ్‌బాబు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మండిపడ్డారు.
ఎల్ఆర్ఎస్ రద్దు హామీ ఏమైంది? - ఈనెల 6న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాలు : కేటీఆర్
Thalasani Fires On Congress : రాష్ట్రంలో 20లక్షల దరఖాస్తుదారుల నుంచి 20 వేల కోట్లు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలు పార్లమెంటు ఎన్నికల కోసమే కాంగ్రెస్ చేస్తుందని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. రాష్ట్ర అధినాయకత్వం పిలుపుతో రోడ్డెక్కిన గులాబీ శ్రేణులు ప్రభుత్వ కార్యాలయాలు సహా చౌరస్తాలలో ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలతో హోరెత్తించారు. గురువారం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు, ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేయనున్నారు.
మూడేళ్లకు ఎల్‌ఆర్'ఎస్' - సర్కారు నిర్ణయంతో హెచ్ఎండీఏకు రూ.1000, జీహెచ్ఎంసీకి రూ.450 కోట్లు
పెండింగ్‌లో 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు - కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ