BRS got zero seats in the Lok Sabha Elections 2024 : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. రాష్ట్రంలోని 17 స్థానాల్లో పోటీచేసిన గులాబీపార్టీ అభ్యర్థులు ఒక్కచోట గెలవకపోవడంతో, సంపూర్ణ పరాజయాన్ని మూటగట్టుకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సార్వత్రిక ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న బీఆర్ఎస్, గౌరవప్రదమైన స్థానాలే లక్ష్యంగా పెట్టుకుంది.
గుంటూరు జిల్లాలో కూటమి క్లీన్‌స్వీప్ - భారీ మోజర్టీతో గెలిచిన అభ్యర్థులు
సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పార్టీని వీడినా కొత్తస్థానాల్లో ఇతరులకి అవకాశం కల్పించారు. 12 జనరల్ సీట్లలో ఆరింటిని బీసీ సామాజికవర్గానికి కేటాయించారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలోనూ సమావేశాలు నిర్వహించి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేశారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలతోపాటు బస్సు యాత్ర, రోడ్ షోలో ద్వారా ప్రచారం చేశారు.
తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ ధ్యేయంగా ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ అభ్యర్థులను లోక్‌సభకు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ మంత్రులు, నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఇవేవీ కూడా గులాబీ పార్టీకి కలిసి రాలేదు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు బోణీ కొట్టలేదు. ఒక్క చోట కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించలేదు.
పార్టీ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గం ఉన్న మెదక్‌పై బీఆర్ఎస్ భారీగా ఆశలు పెట్టుకొంది. ఎమ్మెల్యేలు ఉన్నందున మల్కాజి గిరి, సికింద్రాబాద్‌తో పాటు నాగర్ కర్నూల్, పెద్దపల్లి తదితర స్థానాల్లోనూ మంచి ఫలితాలు ఉంటాయని అనుకున్నారు. అయితే ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రభావం చూపలేకపోయారు. 17 స్థానాల్లో ఒక్క చోట కూడా గెలుపు అందుకోలేకపోయారు.
'ఆ విషయంలో నా లెక్క తప్పింది' - ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్యుడు వేణుస్వామి వీడియో
చరిత్రలో ఏనాడు కూడా బీఆర్ఎస్కు ఇంత దారుణ ఫలితాలు రాలేదు. పార్టీ పెట్టిన తర్వాత 2004లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ ఐదు స్థానాలను గెల్చుకొంది. 2009లో మహాకూటమిలో భాగస్వామిగా పోటీ చేసి కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014 లో ఒంటరిగా పోటీ చేసి అత్యధికంగా 11 స్థానాల్లో విజయం సాధించింది.
రాష్ట్రంలో రెండో మారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు తొమ్మిది స్థానాల్లో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 స్థానాలు సాధించి అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్, ఈ ఎన్నికల్లో అంత కంటే ఘోర పరాజయాన్ని చవిచూసి ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు.
ఉండిలో టీడీపీ గెలుపు - రఘురామకృష్ణరాజుకు 56 వేల మెజారిటీ - AP Election Result 2024