ETV Bharat / state

సీఎం ఛాంబర్ ముందు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేల ధర్నా - బలవంతంగా బయటకు తీసుకొచ్చిన మార్షల్స్ - POLICE ARREST THE BRS MLAS

BRS MLAs are Arrested : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సీఎం ఛాంబర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. మార్షల్స్ వారిని బలవంతంగా అసెంబ్లీ నుంచి బయటకు తరలించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లారు.

BRS MLAs are  Arrested
BRS MLAs are Arrested (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 2:03 PM IST

Updated : Aug 1, 2024, 2:32 PM IST

BRS MLAs are Arrested : సబితా ఇంద్రారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్​ఎస్ నేతల ఆందోళన ఇవాళ కూడా కొనసాగింది. ఇవాళ కూడా అసెంబ్లీలో గులాబీ నేతలు సీఎం తీరుపై నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు​ నల్ల బ్యాడ్జీలతో శాసనసభకు వచ్చారు. ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తూ కేటీఆర్ నాయకత్వంలో అసెంబ్లీలో పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. తరువాత బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు.

దీంతో నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. బయట వారిని అరెస్ట్ చేసిన చేసిన తరువాత, పోలీస్ వాహనంలోనే వారిని తెలంగాణ భవన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై బీఆర్​ఎస్ సభ్యులు మండిపడ్డారు. అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్​ అవుతుందని సీఎం నికృష్టంగా మాట్లాడారని కేటీఆర్​ మండిపడ్డారు. మహిళలను నమ్ముకుంటే ముంచుతారని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లడటం శోచనీయమన్నారు. ఈ ముఖ్యమంత్రి అన్​ఫిట్​ ముఖ్యమంత్రి అని కేటీఆర్ విమర్శించారు. మరోవైపు సభాపతి నల్ల డ్రెస్‌తో రావడంపై హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకు మద్దతుగా నల్ల డ్రస్‌తో వచ్చిన స్పీకర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

బీఆర్​ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు: ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సోయి లేకుండా, ఇద్దరు సీనియర్ మహిళా సభ్యులపై అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరి మనసులను నొప్పించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం, అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

'సీఎం నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు' - మీడియా ముందు సబిత ఇంద్రారెడ్డి కంటతడి - SABITA INDRAREDDY ON CM COMMENTS

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పాలి : హరీశ్‌రావు - Harish Rao Reaction on CM Comments

Last Updated : Aug 1, 2024, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.