BRS MLA Padi Kaushik Reels In Yadadri Temple : తెలంగాణ రాష్ట్రంలో వివాదాలు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. గతంలో అరెకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కొంచెం చక్కబడినట్టు కనిపించగా, తాజాగా పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కౌశిక్ రెడ్డి తన సతీమణి, కుమార్తెతో కలిసి రీల్స్ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం వివాదానికి దారి తీసింది. యాదాద్రి క్షేత్రంలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Happy birthday to Shalini! Every moment spent with you is special, and your happiness means everything to me✨🎂 pic.twitter.com/NFxA5UknpR
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) October 20, 2024
వివరాల్లోకి వెళితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. దీంట్లో తన సతీమణి శాలిని పుట్టిన రోజు సందర్భంగా పోస్టు చేసిన వీడియో వివాదానికి తెరతీసింది. ఆ వీడియోలో తన సతీమణి శాలినితో కలిసి యాదాద్రి ఆలయంలో తిరుగుతున్నారు. అంతేకాకుండా అక్టోబర్ 3వ తేదీన తన కుమార్తె శ్రీనిక జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి కూడా యాదాద్రి క్షేత్రం వద్ద తీసినవే.
On the day you were born,
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) October 7, 2024
the world became a little brighter. Watching you grow has been the greatest joy, and every moment with you is cherishable.
No matter how the day goes, as soon as I see your beautiful smile, I count my blessings to have you.
Here’s to another… pic.twitter.com/gUEAHf88OQ
ఆలయ మాఢ వీధుల్లో తిరుగుతూ తన కుమార్తె శ్రీనికతో కౌశిక్ రెడ్డి రీల్స్ చేయించారు. ఒక ఎమ్మెల్యేగా బాధ్యతాయుత పదవిలో ఉన్న కౌశిక్ రెడ్డి, ఆలయ క్షేత్రంలో ఇలా రీల్స్ చేయడం సరికాదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూస్తే కౌశిక్ రెడ్డి ప్రత్యేకంగా రీల్స్ కోసమే ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. వాళ్లు రీల్స్ చేసేటప్పుడు భక్తులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం.
ప్రస్తుతం వివాదం రేపిన ఈ రీల్స్‌పై ఆలయ పాలక మండలి స్పందించలేదు. ఈ విషయం పై ఆలయ ఈవో భాస్కర్ రావును వివరణ కోరగా, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆలయంలో చిత్రీకరణ కోసం అనుమతి కోరగా అనుమతి ఇవ్వలేదని తెలిపారు. బయటి ప్రాంగణంలో తీసుకోవచ్చని తెలియజేశానన్నారు.
యాదాద్రి 'లడ్డూ' రిజల్ట్స్ వచ్చేశాయ్ - స్వచ్ఛత పరీక్షల్లో ఏం తేలిందంటే?