ETV Bharat / state

రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్​ హైదరాబాద్​ అభివృద్ధిని అడ్డుకుంటోంది : కేటీఆర్​ - KTR Meet GHMC Corporators

BRS MLA KTR Meet with GHMC Corporators : రాజకీయ దురుద్దేశాలతోనే కాంగ్రెస్​ పార్టీ హైదరాబాద్​ నగర అభివృద్ధిని అడ్డుకుంటోందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆరోపించారు. ఇంకా కాంగ్రెస్​ ప్రతిపక్షమే అనే భ్రమలో ఉందన్నారు. జీహెచ్​ఎంసీ బీఆర్​ఎస్​ కార్పొరేటర్లలతో బీఆర్​ఎస్​ భవన్​లో సమావేశం జరిగింది.

BRS MLA KTR
BRS MLA KTR Meet with GHMC Corporators
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 9:55 PM IST

BRS MLA KTR Meet with GHMC Corporators : కాంగ్రెస్​ పార్టీ ఇంకా వారు ప్రతిపక్షమే అనే భ్రమలోనే ఉందని, అందుకే బట్ట కాల్చి మీదేస్తుందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​(KTR) ఎద్దేవా చేశారు. బీఆర్​ఎస్​ భవన్​లో జీహెచ్​ఎంసీ బీఆర్​ఎస్​ కార్పొరేటర్లతో కేటీఆర్​ సమావేశమయ్యారు. జనరల్​ బాడీ సమావేశాలకు అందరూ హాజరు కావాలని సూచించారు. ఆరు గ్యారంటీల్లో ఉన్న 420 హామీలకు కేవలం రూ.57 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. కేవలం మహాలక్ష్మి పథకానికి(Maha Lakshmi Scheme) రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని చెప్పారు.

మరి మిగతా వాటి అమలు ఎలా సాధ్యమని బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​ ప్రశ్నించారు. బడ్జెట్(Telangana Budget)​పై పలు అంశాలను లేవనెత్తి రైతుబంధు, రైతుబీమా వంటి వాటికి నిధులు ఎలా కేటాయిస్తారో చెప్పలేదని మండిపడ్డారు. నగర పరిధిలో అసెంబ్లీ స్థానాలు క్లీన్​ స్వీప్​ చేసేందుకు కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ దురుద్దేశాలతోనే కాంగ్రెస్​ పార్టీ హైదరాబాద్​ నగర అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు.

ఆ విషయంలో ఒక్క మాటా మాట్లాడరేం - రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారు : కేటీఆర్

KTR Fires on Congress : ఈ ప్రభుత్వం ప్రజాపాలన అని చెబుతూనే జీహెచ్​ఎంసీ(GHMC) జనరల్​ బాడీ సమావేశం, స్టాండింగ్​ కౌన్సిల్​ ఎన్నికలు జరగకుండా ఆపుతుందని కేటీఆర్​ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ గురించి పూర్తి అవగాహన తమకుందని, కాంగ్రెస్​ వాళ్లే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని అందుకే సందర్శిస్తున్నారు, చూసి రండని కేటీఆర్​ పేర్కొన్నారు. ఈనెల 19వ తేదీన జరగబోయే జీహెచ్​ఎంసీ జనరల్​ బాడీ మీటింగ్​కు ఎమ్మెల్యేలు అంతా హాజరవుతారని చెప్పారు. సీఎంను కలిసింది పార్టీ మారేందుకు కాదని పార్టీ మారే ఆలోచనలో ఏ కార్పొరేటర్​ లేరని మేయర్​ గద్వాల విజయలక్ష్మి స్పష్టం చేశారు.

"13వ తేదీన కేఆర్​ఎంబీపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసింది. ఈ విషయాన్ని నిరసిస్తూ ఛలో నల్గొండ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో కృష్ణా బేసిన్​ కిందకు వచ్చే ఐదు జిల్లాలు ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్​, మహబూబ్​నగర్​, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు విచ్చేయనున్నారు. ఇందుకు కొనసాగింపుగానే ఈ రోజు జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లతో ఉమ్మడి సమావేశం నిర్వహించడం జరిగింది. 19వ తేదీన జీహెచ్​ఎంసీ జనరల్​ బాడీ మీటింగ్​ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్​ నగరం మీద పగపట్టినట్లు వ్యవహరిస్తోంది. దీన్ని కూడా నిరసించాలని నిర్ణయం తీసుకున్నాము. హైదరాబాద్​ పరిధిలో ప్రజలు మాకు ఏకపక్షంగా తీర్పును ఇచ్చి 16 స్థానాలు ఇవ్వడంతో వారికి ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ హామీలు ఇచ్చిందో ఆ హామీలను నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్​ పార్టీలోకి ఎవరైనా వెళిపోతే అది వారి ఇష్టం. అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతుంది." - కేటీఆర్​, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​

రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్​ హైదరాబాద్​ అభివృద్ధిని అడ్డుకుంటుంది కేటీఆర్​

రైతులకు ఎన్నికల్లో చెప్పింది చాంతాడంత - బడ్జెట్​లో ఇచ్చింది చెంచాడంత : హరీశ్​ రావు

కాంగ్రెస్​ 420 హామీలు చూసి జనం మోసపోయారు - చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.