BRS MLA Kadiyam On CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన కట్టడమైనప్పటికి రేవంత్ సర్కార్ మాత్రం విఫల ప్రాజెక్టుగా చూపించడానికి ప్రయత్నిస్తోందని స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే భాష మార్చుకొని తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు.
మాజీ సీఎం కేసీఆర్పై రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్న కడియం తెలంగాణ గొప్పదనాన్ని కేసీఆర్ దేశం మొత్తం చాటారని పేర్కొన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటే కాదని దానికి రూ.3 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశామని చెప్పారు. మూడు పిల్లర్లు కుంగడాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని సూచించారు. నిపుణులతో విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు లోపాలను ప్రజలకు వివరించేందుకు చలో మేడిగడ్డ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు.
ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే సభను పక్కదారి పట్టిస్తున్నారు : కడియం
BRS MLA Kadiyam Srihari Comments On congress : రాజకీయాల కోసం మేడిగడ్డను వాడుకోవద్దని కడియం కాంగ్రెస్కు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల రైతులకు మేలు జరిగిందని, కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం వైఫల్యాలను చూపెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాజకీయాల కోసం రైతాంగాన్ని ఆగం చేయాలని చూస్తోందని విమర్శించారు. మేనిఫెస్టోలపై చర్చించడానికి బీఆర్ఎస్ సిద్దంగా ఉందని ఆరు గ్యారంటీల పేరుతో 13 హామిలిచ్చారని అవి ఇంకా అమలు చేయలేదని పేర్కొన్నారు. అవన్నీ అమలు చేయకుండా నాలుగు గ్యారంటీలను అమలు చేశామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
" బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టేవారు ఇంకా ఎవరు పుట్టలేదు.రాజకీయాల కోసం కాంగ్రెస్ మేడిగడ్డను వాడుకుంటోంది. మేడిగడ్డ కుంగిపోవడానికి సాంకేతిక కారణాలు ఉండొచ్చు.మేడిగడ్డపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోండి.మేడిగడ్డకు ఖర్చు చేసింది రూ.3వేల కోట్లు మాత్రమే. రాజకీయాల కోసం రైతులను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతోంది. ప్రతిపక్షాలను విమర్శించడమే సీఎం పనిగా పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక భాష మార్చుకుంటారనుకున్నాం. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ లీడర్లు ప్రజలను మోసం చేస్తున్నారు." -క డియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల సభలో సీఎం రెచ్చిపోయి మాట్లాడారని, దేశంలో కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ అని తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెబుతున్నారని విమర్శించారు. ఇందిరమ్మ పేరుతోనే ఇప్పటికీ కాలం గడుపుతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన లోక్ సభ స్థానంలో ఒక్క అసెంబ్లీ సీటు గెలవలేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో లోక్సభ హీట్ - బీఆర్ఎస్, బీజేపీలకు రేవంత్ ఛాలెంజ్ - కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త జోష్
ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీల అమలు - బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం నమ్మొద్దు : సీఎం రేవంత్