ETV Bharat / state

నేడు కాళేశ్వరం సందర్శనకు బీఆర్ఎస్ నేతలు - BRS LEADERS KALESHWARAM VISIT TODAY

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 24, 2024, 7:52 PM IST

Updated : Jul 25, 2024, 6:45 AM IST

BRS Kaleshwaram Tour Today : కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్​ఎస్​ నేతలు ఈరోజు సందర్శించనున్నారు. నేడు అసెంబ్లీ సమావేశం అనంతరం బయలుదేరి అక్కడకు వెళ్లనున్నారు. ఈ పర్యటన రెండు రోజుల పాటు సాగనుంది.

BRS Leaders Kaleshwaram Schedule
BRS Kaleshwaram Tour (ETV Bharat)

BRS Leaders Visit Kaleshwaram Project Today : భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం నేడు మేడిగడ్డ పర్యటనకు వెళ్లనుంది. గోదావరిలో ఉన్న నీటిని ఎత్తిపోసి రైతులకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఇవ్వడం లేదని బీఆర్​ఎస్​ అంటోంది. జలాశయాలకు నీటిని మళ్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఈ పర్యటన చేపడుతున్నట్లు పేర్కొంది. నేడు బడ్జెట్​ ప్రసంగం ముగిసిన వెంటనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టుకు బయలుదేరుతారు.

సాయంత్రం కరీంనగర్​లోని దిగువ మానేరు డ్యాంను బీఆర్​ఎస్​ బృందం పరిశీలిస్తుంది. రాత్రికి రామగుండంలో బస చేస్తారు. మరలా శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నేపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్​ హౌస్​ను బీఆర్​ఎస్​ బృందం పరిశీలిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లి ఆనకట్టను సందర్శిస్తారు. మేడిగడ్డ ఆనకట్ట పరిస్థిత, అక్కడ ప్రవాహం, పంప్​ హౌస్​ వద్ద నీటిమట్టం, ఎత్తిపోసేందుకు ఉన్న అవకాశాలు, తదితరాల గురించి పరిశీలిస్తారు.

కాళేశ్వరమే కరవును పారదోలే “కల్పతరువు" : కేటీఆర్​ - KTR will Visit Medigadda Soon

'15,000,000,000,000 - 15 పక్కన ఇన్ని సున్నాలా!! - మూసీ అభివృద్ధి వ్యూహం వెనక ఉద్దేశమేంటి' - KTR On Musi River Development

Last Updated : Jul 25, 2024, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.