ETV Bharat / state

బోనమెత్తనున్న భాగ్యనగరం - నేడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం - BONALU FESTIVAL 2024 BEGINS TODAY - BONALU FESTIVAL 2024 BEGINS TODAY

Hyderabad Bonalu 2024 : భాగ్యనగరం బోనాల వేడుకలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఆగస్టు 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల జాతర ప్రారంభమవుతుంది. నేడు గోల్కొండలోని జగదాంబికా అమ్మవారు తొలిబోనం అందుకోనున్నారు.

Hyderabad Bonalu 2024
Hyderabad Bonalu 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 7:06 AM IST

Updated : Jul 7, 2024, 7:15 AM IST

Bonalu Festival Begins Today in Telangana : ఆషాఢమాసం వచ్చేసింది. బోనాల సందడి షురూ కానుంది. డప్పు చప్పుళ్లు, తీన్మార్ దరువులతో నగరం మారుమోగనుంది. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం సరికొత్త శోభను సంతరించుకోనుంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 4 వరకు బోనాల ఉత్సవాలు సాగనున్నాయి.

ఆషాఢమాసంలో వచ్చే తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ ఆనవాయితీ ప్రకారం తొలి ఆదివారమైన ఇవాళ ఉత్సవాలకు అంకుర్పారణ జరగనుంది. గోల్కొండలోని జగదాంబిక, మహంకాళీ అమ్మవార్లు తొలి బోనం అందుకుంటారు. దశాబ్ది బోనాల వేడుకల పేరుతో ఈసారి ప్రభుత్వం బోనాల జాతరను మరింత శోభాయమానంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఇవాళ్టి నుంచి ఆషాఢమాసం మొత్తం గురు, ఆదివారాల్లో బోనాలు సమర్పిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. ఇవాళ తొలి పూజ కావడంతో ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. లంగర్‌హౌస్ నుంచి ఊరేగింపుగా వెళ్లి చోట బజార్‌లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం బంజారా దర్వాజ వైపు నుంచి నజర్ బోనం తీసుకుని, అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంటుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తరువాత భక్తులు బోనాలు సమర్పిస్తారు.

డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు : 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ రకాల పూజలు, చేసి 28న బోనాల వేడుకలు నిర్వహిస్తారు. బోనాల రోజు ఉదయం అమ్మవారికి బైండ్లవారు బలిహరణ కార్యక్రమం చేస్తారు. అనంతరం ఆలయ అర్చకులు మహాభిషేకం చేస్తారు. తర్వాత నుంచి భక్తులు బోనాలను సమర్పిస్తారు. అమ్మవారి ఊరేగింపు డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మా బైలెల్లినాదో అంటూ సాగే అమ్మవారి ఊరేగింపు భక్తులను కనువిందు చేస్తుంది. గోల్కొండ బోనాల అనంతరం ఈనెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, 28, 29 తేదీల్లో లాల్ దర్వాజ బోనాలు జరగనున్నాయి.

బల్కంపేట ఎల్లమ్మ నూతన ఉత్సవ కమిటీని వెంటనే రద్దు చేయాలి : కాంగ్రెస్​ నాయకులు - Balkampet yellamma temple Issue

జగిత్యాలలో ఘణంగా బోనాల వేడుకలు : జగిత్యాల పట్టణంలో అల్ఫోర్స్‌ కళాశాల విద్యార్థులు ఆనందోత్సవంతో ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు. అమ్మవారికి విద్యార్థులు బోనాలు సమర్పించారు. అమ్మవారి విశిష్టత బోనాల పండగ ప్రత్యేకతను చాటేలా వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. బోనాల సంసృతిని తెలిపేలా నృత్యాలు, నాటకాలు చేయగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

బోనమెత్తనున్న భాగ్యనగరం, తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు - విశేషాలివే! - Bonalu festival 2024

Last Updated : Jul 7, 2024, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.