DOST Notification 2024 Schedule : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఉన్నత విద్యా మండలి ఇవాళ దోస్త్ నోటిఫికేషన్ 2024 విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులలో భాగంగా బీకాం ఫైనాన్స్‌తో పాటు బీఎస్సీ బయో మెడికల్ సైన్స్ వంటి కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎప్‌సెట్ పరీక్ష కేంద్రాల్లో ఫేసియల్ రికగ్నేషన్ అమలు - EAPCET 2024
ఈ సందర్భంగా మాట్లాడుతూ మొత్తం మూడు దఫాలుగా డిగ్రీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేయనున్నట్టు వివరించారు. తొలిదశ రిజిస్ట్రేషన్లు మే 6 నుంచి ప్రారంభమవుతాయన్న ఆయన, మే 25వ వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నట్టు వివరించారు. 200 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 3న తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు.
మొదటిదశ రిజిస్ట్రేషన్లు.. మే 6 తేదీ నుంచి మే 25 వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ జరగనుంది. రూ. 200 రుసుంతో 'దోస్త్' రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 15 నుంచి మే 27 వరకు 'దోస్త్' వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. జూన్ 3న 'దోస్త్' మొదటి దశ సీట్ల కేటాయింపు జరిపి, జూన్ 4 నుంచి 10లోపు 'దోస్త్' సెల్ఫ్ రిపోర్టుకు అవకాశం ఇవ్వనున్నారు.
రెండవదశ రిజిస్ట్రేషన్లు.. ఇక 'దోస్త్' సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ జూన్ 4 నుంచి జూన్ 13 వరకు నిర్వహించునున్నారు. రూ. 400 రుసుంతో 'దోస్త్' సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇవ్వనున్నారు. జూన్ 4 నుంచి జూన్ 14 వరకు దోస్త్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. జూన్ 18న 'దోస్త్' రెండో దశ సీట్ల కేటాయింపు జరిపి, జూన్ 19 నుంచి 24 వరకు 'దోస్త్' సెల్ఫ్ రిపోర్ట్‌కు అవకాశం ఇవ్వనున్నారు.
మూడో దశ రిజిస్ట్రేషన్లు.. ఇక 'దోస్త్' మూడో దశ రిజిస్ట్రేషన్లు జూన్ 19 నుంచి 25 వరకు జరగనున్నాయి. రూ. 400 రుసుంతో 'దోస్త్' మూడో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించనున్నారు. జూన్ 19 నుంచి 25 వరకు దోస్త్ మూడో దశ వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. జూన్ 29న 'దోస్త్' మూడోదశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 8 నుంచి డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభించనున్నారు.
టీఎస్ లాసెట్, ఈసెట్2024 షెడ్యూల్ విడుదల- దరఖాస్తులు ఎప్పటినుంచంటే