BJP Vijaya Sankalpa Yathra For Parliament Elections : పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ఫ యాత్రలకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 20 నుంచి 29 వరకు యాత్రలను నిర్వహించనుంది. 5 పార్లమెంట్ క్లస్టర్లలో 5 విజయ సంకల్ప యాత్రలు చేపట్టనుంది. యాత్రలకు క్లస్టర్ వారీగా బీజేపీ పేర్లు పెట్టింది. భువనగిరి, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు భాగ్యనగరమని నామకరణం చేశారు. కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కుమురం భీం అని పేరు పెట్టారు.
Telangana BJP Yatra For Parliament Elections : మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కృష్ణా, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కాకతీయగా పేర్లు పెట్టారు. మార్చి మొదటి వారంలో భారీ బహిరంగ సభ పెట్టాలని యోచిస్తోంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ సీట్లలో కనీసం పది సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పార్టీ శ్రేణులు నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలను రూపకల్పన చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్(Election Schedule) ఫిబ్రవరి 28న వెలువడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. షెడ్యూల్‌కు ముందే రథయాత్రలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకుంది.
BJP Divided 17 Lok Sabha Seats Into 5 Clusters : ఇప్పటికే 17 లోక్‌సభ స్థానాలను ఐదు క్లస్టర్లుగా కమల దళం విభజించుకుంది. ఆదిలాబాద్, నిజామబాద్, పెద్దపల్లి ఒక క్లస్టర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలు కలిపి మరొక్క క్లస్టర్‌గా విభజించి పనిచేస్తోంది. మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్ స్థానాలకు కలిపి ఒక క్లస్టర్. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, భువనగిరి లోక్‌సభ స్థానాలతో మరొక్క క్లస్టర్‌ను ఏర్పాటు చేసుకుంది. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్థానాలతో ఇంకో క్లస్టర్లను ఏర్పాటు చేసింది.
లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లే లక్ష్యంగా 'బీజేపీ క్లస్టర్ సమావేశాలు'
BJP Targets on Lok Sabha Seats : తొలి రోజు యాత్రలను కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించనున్నట్లు కాషాయవర్గాలు చెబుతున్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు కార్నర్ మీటింగ్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మీటింగ్స్‌కు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేలా కార్యచరణ రూపొందిస్తోంది. యాత్రల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, సాహాసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణకు కేటాయించిన నిధులు, గత బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజాక్షేత్రంలో ప్రశ్నించేందుకు సమాయత్తమవుతోంది.
తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం - లోక్‌సభ ఎన్నికల వేళ జిల్లాలకు కొత్త అధ్యక్షులు
BJP Rath Yatra in Telangana : కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించిన హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకు కేంద్రాన్ని సీబీఐ విచారించాలని కోరడం లేదని నిలదీయాలని యోచిస్తోంది. పది రోజుల పాటు యాత్రలతో రాష్ట్రమంతా తిరుగుతూ ప్రజలతో మమేకంకావడం వల్ల బీజేపీకు(Bhartiya Janata Party) మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రథయాత్రలు చేపట్టాలని అంతా సిద్ధం చేసుకున్నాక అనివార్య కారణాల వల్ల వాయిదా పడినపరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా రథయాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టబోతుంది.
వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక - ఏ పార్టీతోనూ కలవబోమన్న కిషన్ రెడ్డి
పాలమూరు బీజేపీ లోక్‌సభ సీటు ఎవరిది? - రేసులో ఆ ముగ్గురు కీలక నేతలు