MLA Pinnelli Ramakrishna Destroyed EVM: ఎన్నికలు జరిగిన రోజున మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ( EVM ) వీవీ ప్యాట్‌లను పగలకొట్టి అరాచకం సృష్టించారు. పోలింగ్ రోజు జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతల అరాచకాలకు ఈ ఘటన పరాకాష్టగా పేర్కొన్నాయి.
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. మాచర్లలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణరెడ్డి ఈవీఎంను ( EVM ) ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వేట మొదలుపెడతామని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పడం వైఎస్సార్సీపీ నేతల అరాచకాలకు అద్దం పడుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటివన్నారు. తెనాలిలో ఎమ్మెల్యే ఓటరును చెంపదెబ్బ కొట్టడం దారుణమని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. పురందరేశ్వరిపై సజ్జల, అంబటి వ్యాఖ్యలు సరికావని తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు, దౌర్జన్యాల దృశ్యాలు, గోడపత్రికలను బీజేపీ నేతలు ప్రదర్శించారు. దౌర్జన్యాలకు పాల్పడిన వారు ఖచ్చితంగా జైలుకు వెళ్తారని పేర్కొన్నారు.
ఈవీఎం ధ్వంసం ఘటనపై ఈసీ ఆగ్రహం- పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశం - EC SERIOUS ON PINNELLI RAMAKRISHNA
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna ) తన అనుచరులతో దూసుకెళ్లి ఈవీఎంను విధ్వంసం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ఎలక్షన్ వాచ్ ఫిర్యాదు చేసింది. ఈనెల 13వ తేదీన పోలింగ్ సందర్భంగా జరిగిన ఈ దురాగతానికి సంబంధించి సీసీ కెమేరా దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో వాటిని తమ ఫిర్యాదుకు జోడించి ఈసీకి పంపించింది. ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరింది. రెంటచింతల మండలం పాల్వాయ్‌గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం నేలకేసి కొట్టిన దృశ్యాలు వెబ్ కెమేరాల్లో నమోదైనందున తక్షణం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ వాచ్ రాష్ట్ర కన్వీనరు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ (Nimmagadda Ramesh Kumar) విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఈ తరహా విధ్వంసకాండలు, దుశ్చర్యలకు సాహసించేందుకు కూడా వెనుకాడేలా చర్యలు చేపట్టాలని తమ ఫిర్యాదులో కోరారు.
పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు - ఏడేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం: సీఈవో - CEO MK Meena on Macherla Incidents