BJP MP Bhupathiraju Srinivasa Verma got Seat in Central Cabinet: పశ్చిమగోదావరి జిల్లా నుంచి బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కింది. భూపతిరాజు శ్రీనివాసు వర్మ నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎంపీగా గెలుపొందారు. ఈయన 04-08-1967న భీమవరంలో జన్మించారు. రెండుసార్లు నర్సపురం ఎంపీగా పోటి చేశారు. బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడే ఎంపీగా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పటివరకు నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటి చేసిన వారిలో ఎవరికి రాని రికార్డ్ స్థాయి మెజారీటితో శ్రీనివాస్ వర్మ గెలుపొందారు. 2 లక్షల 76 వేల 802 ఓట్ల మెజారిటితో గెలుపొందారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాస్ వర్మ వ్యవహారిస్తున్నారు.
భీమవరంలోని దంతులూరి నారాయణరాజు - డీఎన్ఆర్ కళాశాల సంయుక్త కార్యదర్శిగా, కార్సపాండెంట్గా పనిచేశారు. బీజేపీ యువమోర్చలో క్రీయ శిలక పాత్ర పొషించారు. పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా రెండు సార్లు సేవలు అందించారు. భీమవరం మున్సిపల్ కౌన్సిలర్‌గా బీజేపీ తరపున ఏనికైయ్యారు. ఏఆర్ కేఆర్ మున్సిపల్ పాఠశాలలో పాఠశాల విద్య, డీఎన్ఆర్ కళాశాలలో ఉన్నత విధ్య అభ్యసించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, మాస్టార్ లైబ్రెరియన్ కోర్స్ చదివిన శ్రీనివాస్ వర్మ లైబ్రెరియన్గాను ఉద్యోగం చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకునిగా సుమరు రెండు దశాబ్ధలుగా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.
సంఘ్ పరివార్‌తో సత్ససంబంధాలు కలిగిన శ్రీనివాస్ వర్మ, ఏబీవీపీలో చురుకుగా వ్యహరించి పార్టిలో గుర్తింపు పొందారు. భారతీయ జనతా పార్టీ మహిళ మోర్చా విభాగాలకు ఇన్ఛార్జీగా వ్యవహరిస్తున్నారు. నర్సాపురం నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా సేవలందించిన కృష్ణంరాజుకు అత్యంత సన్నిహితుడుగా, ఆత్మీయుడిగా శ్రీనివాస్ వర్మ వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ వర్మ తరపున కృష్ణంరాజు భార్య నాలుగుసార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు.
నా తమ్ముడిని గెలిపిస్తే కృష్ణంరాజుని గెలిపించినట్లేనని శ్రీనివాస్ వర్మ తరపున ప్రచారం చేశారు. సామన్య కార్యకర్తగా పనిచేసిన వ్యక్తికి ఎంపీగా పోటిచేసేందుకు ఎలా అవకాశం ఇస్తారంటూ మహాకుటమి అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మను ఎంపిక చేసే క్రమంలో పార్టీలోనే అంతర్గత వ్యతిరేక ప్రచారం జరిగింది. అయినా బీజేపీ అగ్ర నాయకులు వివాదరహితుడుగా, తొలినుంచి పార్టీ క్రమశీక్షణ చూపిన శ్రీనివాస్ వర్మకే మొగ్గు చూపారు. అనుహ్య మోజరిటితో గెలిచారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణా స్వీకరం చేస్తున్న నరేంద్ర మోదీ మంత్రి వర్గంలో చోటుదక్కించుకున్నారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు మంత్రివర్గంలో బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే.
ఈనెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్! - TDP Leaders Inspecting Venue