BJP Kishan Reddy Fires on BRS Govt : తెలుగురాష్ట్రాల్లో ఏప్రిల్ తొలివారంలో లోక్ సభ ఎన్నికలు ఉండే అవకాశం ఉందని బీజేపీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ హయాంలో బీజేపీ 350 పైగా సీట్లు గెలుస్తుందని వెల్లడించారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదని అన్నారు.
Kishan Reddy on Parliament Elections 2024 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత 17 కోట్ల మంది సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని కిషన్ రెడ్డి అన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగినదని తెలిపారు. ప్రపంచంలో భారతదేశం విశ్వగురు స్థానంలో నిలిపేలా ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని వెల్లడించారు. 500 ఏళ్లుగా భారతీయులు ఎదురుచూస్తున్న అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు.
మోదీతో పోటీకి దరిదాపుల్లో ఎవరూ లేరని సర్వేలన్నీ చెబుతున్నాయి : కిషన్‌రెడ్డి
Kishan Reddy Comments On BRS : తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇండ్లు కట్టించకుండా మోసం చేసిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం అప్పలపాలై ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా, ఓడినా వచ్చే నష్టం ఏమీలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందన్న ఆయన వాటిని ఎలా అమలు చేయాలనే విషయంపై ఆ పార్టీకి స్పష్టమైన రూట్‌మ్యాప్ లేదని విమర్శించారు. మోదీ పాలనలో గత తొమ్మిదేళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామని వెల్లడించారు.
"కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం నరేంద్ర మోదీ నేతృత్వంలో సాకారమైంది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయోధ్య రామమందిరం. జనవరి 22న అయోధ్య రామమందిరంలో జరిగే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని 150 దేశాల్లోని హిందువులందరూ వర్చువల్‌గా వీక్షించనున్నారు. ఇది భారతీయులందరికీ గర్వకారణం." - కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి
"కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ - తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదు"
BJP Kishan Reddy In Loksabha Elections Meeting : కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రులే 2 జీ స్ప్రెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం వంటి కేసుల్లో జైలుకు వెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సుమారు 12 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ రిపోర్టు, సుప్రీంకోర్టు ద్వారా బయటకు వచ్చాయని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే భారత్ 5 వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందని యూకే లాంటి దేశాన్ని కూడా వెనక్కి నెట్టి భారత్ ముందు వరుసలో నిలిచిందని తెలిపారు.
నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలతో కటిక చీకట్లు అలుముకునేవని నేడు సంపూర్ణ విద్యుత్ ఇస్తూ వెలుగులు నింపిందన్నారు. స్మార్ట్‌ఫోన్ తయారీలో చైనా కంటే భారత్ ముందు వరుసలో ఉందని ప్రపంచంలో రెండవ అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా భారత్ ఎదిగిందని తెలిపారు. మన దేశం నుంచి 150 దేశాలకు సెల్ ఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు.
ఆదివాసుల అభివృద్ధి పథకానికి రేపు ప్రధాని మోదీ శ్రీకారం : కిషన్ రెడ్డి