ETV Bharat / state

నేటి నుంచి 21వ బయో ఆసియా సదస్సు - జీవవైద్య సాంకేతిక రంగంలో మార్పులు, ఆవిష్కరణలపై చర్చలు

Bio Asia Summit 2024 in Hyderabad : హైదరాబాద్​లో ప్రతిష్ఠాత్మక 21వ బయో ఆసియా సదస్సు నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 9:10 AM IST

21st Bio Asia Summit on Life Sciences
Bio Asia Summit in Hyderabad

Bio Asia Summit 2024 in Hyderabad : హెచ్‌ఐసీసీలో ప్రతిష్ఠాత్మక 21వ బయో ఆసియా సదస్సు నేటి నుంచి మొదలు కానుంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో తొలి రోజు జీనోమ్‌వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌తో పాటు ఇతర కంపెనీలను విదేశీ ప్రతినిధులు సందర్శిస్తారు. 27న ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) దీనిపై ప్రసంగిస్తారు. ప్రపంచ దేశాల్లోని 100కి పైగా ప్రముఖ శాస్త్రవేత్తలు, విదేశీ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా జీవ వైద్య సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు, ఔషధ రంగంలో ఆవిష్కరణలు, ఔషధ పరికరాల ప్రోత్సాహకాలపై చర్చలు జరుపుతారు. ఈ అంశాలపై పరిశోధనలు చేస్తున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహకాలు, చేయూతలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడనుంది.

Bio Asia Summit 2024 : బయో ఆసియా సదస్సు 2024లో ప్రసంగించే ప్రముఖుల పేర్లు ఖరారు.. లిస్ట్​ ఇదే

ఈ సందర్భంగా నోబెల్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు(పెడిస్ట్రియన్​), ఆచార్య గ్రెగ్‌ ఎల్‌ సెమెంజాకు జీనోమ్‌వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ పురస్కారాన్ని అందజేయనున్నారు. 28న పలు చర్చాగోష్ఠిలతో పాటు ముగింపు సమావేశం ఉండనుంది. 700కి పైగా వినూత్న స్టార్టప్​ కంపెనీలు (Startup Company) ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రదర్శనకు పోటీపడగా, నిపుణులు 70 అంకుర సంస్థలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. వీటిలో ఐదింటిని చివరి జాబితాకు ఎంపిక చేసి, సదస్సు ఆఖరి రోజున ప్రత్యేక అవార్డులను అందజేస్తారు.

21st Bio Asia Summit on Life Sciences : 21వ బయో ఆసియా సదస్సుకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, హైదరాబాద్‌ వేదికగా నూతన ఆవిష్కరణలను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) తెలిపారు. జీవ వైద్య రంగంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని విస్తరించడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Bio Asia Summit 2024 : 2024 బయో ఆసియా సదస్సు తేదీలు ప్రకటించిన మంత్రి కేటీఆర్.. ఈసారి థీమ్​ ఇదే

ప్రపంచ వేదికపై తెలంగాణ జీవ వైద్య రంగం అభివృద్ధి చెందడానికి, నూతన ఆవిష్కరణలను శక్తిమంతం చేయడానికి, అద్భుత పరిష్కారాలను ప్రదర్శించడానికి ఈ సదస్సు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సదస్సులో డేటా(Data), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence) విప్లవం అంశాలే ప్రధానంగా చర్చలు కొనసాగుతాయని వివరించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణను శిఖరాగ్రంలో నిలపడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.

బయో ఏసియా సదస్సుకు 200మంది ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.