Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra Completed : నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ నెల 12, 13వ తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. నేటితో (ఏప్రిల్ 13వ తేదీతో) ఈ కార్యక్రమం ముగుస్తుంది. గత ఆరు నెలలుగా 25 లోక్‌సభ స్థానాల పరిధిలోని 95 నియోజకవర్గాల్లో 194 బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. అందుకోసం ఆమె రాష్ట్రవ్యాప్తంగా 8,500 కిలో మీటర్లు ప్రయాణించారు. ఇప్పటి వరకు ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి అశేష ప్రజాదరణ లభించింది.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పార్టీ కార్యకర్త కుంచం సుబ్బారావు కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది మృతిచెందిన సుబ్బారావు చిత్రపటానికి నివాళులర్పించిన భువనేశ్వరి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని సుబ్బారావు కుటుంబానికి భువనేశ్వరి భరోసానిచ్చారు. కాకర్ల గ్రామంలో మరణించిన కోట విశ్వనాథం కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి వారికి ధైర్యం చెప్పారు.
రేపు తిరువూరులో 'నిజం గెలవాలి' ముగింపు సభ - ముమ్మర ఏర్పాట్లు - Bhuvaneshwari Nijam Gelavali Yatra
Nara Bhuvaneshwari in NTR District : చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపం చెంది మరణించిన వారి కుటుంబాలను పరామర్శించటమే లక్ష్యంగా చేపట్టిన నిజం గెలవాలి పర్యటన ముగిసింది. గతేడాది అక్టోబర్ 25న చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన నిజం గెలవాలి కార్యక్రమం 6నెలల పాటు కొనసాగింది. 25పార్లమెంటు నియోజకవర్గాలు, 95 అసెంబ్లీ స్థానాల్లో ఇది కొనసాగింది. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన 203మంది కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి ఓదార్చారు. ఒక్కో కార్యకర్త కుటుంబానికి 3లక్షల ఆర్థికసాయం అందించారు.
తెనాలి, వినుకొండ నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర - Nijam Gelavali Yatra
Bhuvaneshwari Nijam Gelavali Yatra : కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్నివేళలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. చనిపోయిన కార్యకర్తల పిల్లల్లో చదువుకుంటున్న వారికి ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఉచిత విద్య అందించే బాధ్యత చేపట్టారు. 14 విడతల్లో, 47 రోజుల పాటు భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం కొనసాగింది. 150పైబడి ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం నింపారు. నిజం గెలవాలి కార్యక్రమం మొత్తం మీద వివిధ సామాజిక వర్గాల ప్రజలతో 9 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. 6నెలల సమయం, 14 విడతల కార్యక్రమం, 47రోజుల ప్రయాణంలో 9,080కిలోమీటర్ల దూరం భువనేశ్వరి ప్రయాణించారు.
13న ముగియనున్న 'నిజం గెలవాలి' యాత్ర - సభకు చురుగ్గా ఏర్పాట్లు - BHUVANESWARI NIJAM GELAVALI YATRA