ETV Bharat / state

రూ.151 చెల్లిస్తే ఇంటికే రాములోరి కల్యాణ తలంబ్రాలు - టీఎస్​ఆర్టీసీ కొత్త స్కీమ్ - Bhadrachalam Talambralu Delivery - BHADRACHALAM TALAMBRALU DELIVERY

Bhadrachalam Swamy Talambralu Delivery by TSRTC Cargo : భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు డోర్​ డెలివరీ చేసేలా టీఎస్​ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్​లోని బస్‌ భవన్‌లో ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Bhadradri Ramaiah Kalyanam Tickets 2024
Bhadrachalam Swamy Talambralu Delivery by TSRTC Cargo
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 7:21 PM IST

Bhadrachalam Swamy Talambralu Delivery by TSRTC Cargo : శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి, వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అని అధికారులు తెలిపారు.

బుకింగ్‌ పోస్టర్‌ ఆవిష్కరణ : శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది. హైదరాబాద్​లోని బస్‌ భవన్‌లో ఇవాళ భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. తలంబ్రాల బుకింగ్‌ను ఎండీ సజ్జనార్​ ప్రారంభించారు. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నట్లు సజ్జనార్​ పేర్కొన్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని, ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.

శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తుల కోసం : ఆర్టీసీ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్‌ చేసుకుంటున్నారని టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు, గత ఏడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసింది పేర్కొన్నారు. భద్రాద్రిలో ఈ నెల 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని సంస్థ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

Bhadradri Ramaiah Kalyanam Tickets 2024 : రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్​లో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని సజ్జనార్‌ చెప్పారు. సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్​లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తలంబ్రాల సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లు 040-23450033, 040-69440000, 040-69440069లలో సంప్రదించాలని సూచించారు.

భద్రాద్రి రామయ్య కల్యాణానికి ముహూర్తం ఫిక్స్ - ఏప్రిల్‌ 9 నుంచి బ్రహ్మోత్సవాలు

భక్తులకు శుభవార్త - ఆన్‌లైన్‌లో శ్రీరామనవమి కల్యాణం టికెట్లు - Sri Rama Navami in Bhadradri

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.