ETV Bharat / state

బెజవాడలో పారిశుధ్యం అస్తవ్యస్తం - ఆనారోగ్యంతో ప్రజలు విలవిల - Drainage Problems in Bejawada - DRAINAGE PROBLEMS IN BEJAWADA

Bejawada People Facing Serious Drainage Problems : పారిశుధ్యంలో విజయవాడ నగరం దేశంలోనే ఐదో స్థానంలో ఉందని వీఎంసీ (VMC) పాలక పక్షం గొప్పలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. కేంద్రం నిధులతో చేపట్టిన డ్రైనేజీ పనుల్లో ఐదేళ్లపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

bejawada_people_facing_serious_drainage_problems
bejawada_people_facing_serious_drainage_problems (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 4:26 PM IST

మురుగు ముసిరిన బెడవాడ- ఆనారోగ్యంతో ప్రజలు విలవిల (ETV Bharat)

Bejawada People Facing Serious Drainage Problems : మురుగు కాలువల సమస్యలతో బెజవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలల తరబడి డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త తొలగించడం లేదని స్థానికులు చెబుతున్నారు. నగరపాలక సంస్థలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ పాలక మండలి పారిశుద్ధ్య సమస్యను పట్టించుకోకపోవడంతో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పారిశుద్ధ్యంలో విజయవాడ నగరం దేశంలోనే ఐదో స్థానంలో ఉందని వీఎంసీ (VMC) పాలక పక్షం గొప్పలు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. కేంద్రం నిధులతో చేపట్టిన డ్రైనేజీ పనుల్లో ఐదేళ్లపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

'విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 1.01 లక్షల ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉండగా 1.09 లక్షల ఇళ్లకు కనెక్షన్లే లేవు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను వీఎంసీ (VMC) సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించకపోవటంతో మురుగు పేరుకుపోతోంది. దీంతో చిన్నపాటి వర్షానికే పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. బందరు రోడ్డు, ఏలూరు రోడ్లపై భారీ స్థాయిలో నీరు నిలిచిపోతోంది. బహిరంగ ప్రదేశాలు, కాలువల్లో చిరు వ్యాపారులు చెత్తవేయడాన్ని అధికారులు నియంత్రించటం లేదు.' -కోనేరు శ్రీధర్, వీఎంసీ మాజీ మేయర్​, సురేశ్, స్థానికుడు

చినుకు పడితే చిగురుటాకులా వణుకుతున్న బెజవాడ- లోతట్టు ప్రాంతాలు జలమయం - SANITATION PROBLEM

YSRCP Neglected Waterlogging, drain issues in Vijayawada : 2014-2019 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు VMC పరిధిలో బెజవాడ అభివృద్ధి కోసం కేంద్రాన్ని ఒప్పించి 462 కోట్ల నిధులు రాబట్టింది. L&T సంస్థకు పనులు అప్పగించి శరవేగంగా చేపట్టింది. సుమారు 200 కోట్ల రూపాయల పనులు పూర్తిచేసింది. తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఆ పనుల్ని నిలిపేసింది. దీంతో నగరంలో అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సమస్యకు పరిష్కారం దొరకకుండా పోయింది. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతోనే పనులు ఆగిపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు భావిస్తున్నారు.

వర్షాకాలం ముంచుకొచ్చినా చలనం లేదా?- అస్తవ్యస్త డ్రైనేజీలతో నగరాల్లో అవస్థలు - DRAINAGE PROBLEM

విజయవాడలో అస్తవ్యస్తంగా డ్రైనేజీ నిర్మాణం - ప్రజాధనం వృథాపై విమర్శలు - Improper drainage system

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.