ETV Bharat / state

'ఫోన్​ ట్యాపింగ్​పై సీబీఐ విచారణ కోరాలి' - సీఎం రేవంత్​కు బండి సంజయ్​ లేఖ - Bandi Sanjay Letter to CM Revanth - BANDI SANJAY LETTER TO CM REVANTH

BJP MP Bandi Letter to CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ కోరాలని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, ఆ జీవోను రద్దు చేయాలని బండి సంజయ్‌ కోరారు.

BJP MP Bandi Letter to CM Revanth
BJP MP Bandi Letter to CM Revanth (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 1:56 PM IST

Bandi Sanjay Letter to CM Revanth Reddy : ఫోన్​ ట్యాపింగ్​పై సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్​ లేఖ రాశారు. రాష్ట్రంలో సీబీఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఆ లేఖలో గుర్తు చేశారు. ఆ జీవోను రద్దు చేయాలని బండి సంజయ్​ కోరారు. కేటీఆర్​, కేసీఆర్​ ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం నడిపించారని బండి సంజయ్​ ఆరోపించారు. వారిద్దరికీ నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని బండి సంజయ్​ లేఖలో ప్రస్తావించారు.

BJP MLA Alleti Maheshwar Reddy Press Meet : రాచరికపు ఆనవాళ్లు లేకుండా కొత్త చిహ్నాన్ని లీక్​లు ఇచ్చినా మళ్లీ కొత్త చిహ్నం రిలీజ్​ వాయిదా పడిందా అంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్​ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లోగోలో అమరవీరుల స్థూపం పెట్టడాన్ని బీజేపీ తరఫున స్వాగతిస్తున్నామని చెప్పారు. గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వం 360 మంది అమరవీరులను చంపిన ఘటన మళ్లీ గుర్తు చేయాలనుకుంటున్నారా అంటూ విమర్శించారు. చార్మినార్​ను లోగో నుంచి తీసే ధైర్యం కాంగ్రెస్​ ఉందా అంటూ సవాల్​ విసిరారు. అయితే చార్మినార్​ను లోగో నుంచి పూర్తిగా తొలగించాలని బీజేపీ డిమాండ్​ చేస్తుందని అన్నారు. చార్మినార్​ను తొలగించినట్లే హిందువుల ఊచకోత కోసిన ముస్లింల ఆనవాళ్లు పూర్తిగా తీసేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

కాకతీయుల కళాతోరణం తొలగించడం చాలా బాధాకరమైన విషయమని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్​ రెడ్డి ఆవేదన చెందారు. లోగోలో కాకతీయుల తోరణం ఉండేలా పునరాలోచన చేయాలని కాంగ్రెస్​ను కోరారు. చాలా చోట్ల ముస్లిం పేర్లతో వారి పేర్లను పెట్టారన్నారు. ఇంతకుముందు ఉన్న పేర్లనే మళ్లీ పునరుద్ధరించాలని బీజేపీ కోరుకుంటోందని చెప్పారు. సెక్రటేరియట్​పై ఉన్న 30 ముస్లిం టూంబ్స్​ను తొలగించే దమ్ము కాంగ్రెస్​ ప్రభుత్వానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ రాచరికపు ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డికి ఇవన్నీ కనిపించడం లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

బీజేపీని ఆవిర్భావ దినోత్సవానికి పిలవకపోవడం బాధాకరం : ఎప్పటిలోగా ప్రతి కుటుంబానికి రూ.25 వేలు ఇస్తారో సీఎం రేవంత్​ రెడ్డి చెప్పాలని బీజేపీ నేత మహేశ్వర్​ రెడ్డి అడిగారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ప్రభుత్వం తొలగించాలని బీజేపీ డిమాండ్​ చేస్తుందన్నారు. తెలంగాణ బిల్లులో బీజేపీ సహకారాన్ని మరచిపోయి ఈ రోజు ఆవిర్భావ దినోత్సవంకు బీజేపీని ఆహ్వీనించకపోవడం అవమానకరమని వివరించారు. ముస్లిం రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించే దమ్ము, ధైర్యం రేవంత్​ రెడ్డి ప్రభుత్వానికి ఉందా అంటూ బీజేపీ నేత మహేశ్వర్​ రెడ్డి సవాల్​ విసిరారు.

ఫోన్​ట్యాపింగ్ కేసును నీరుగారిస్తే బీఆర్ఎస్​కు పట్టిన గతే కాంగ్రెస్​కు పడుతుంది​ : ఎంపీ లక్ష్మణ్‌ - mp lAxman on phone Tapping Case

జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్లూ ట్యాపింగ్​ - పర్సనల్ డేటా సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్ర - JUDGES PHONE TAPPING IN TELANGANA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.