ETV Bharat / state

రాష్ట్రంలో మరో కంపెనీ భారీ పెట్టుబడి - రూ.700 కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్‌! - BALL BEVERAGE INVESTMENT IN TG - BALL BEVERAGE INVESTMENT IN TG

Ball Beverage Company Investing In Telangana : పరిశ్రమలకు అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్ కంపెనీ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు, అల్యూమినియం టిన్‌ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ యూనిట్ ప్రారంభమైతే, 500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. బాల్ సంస్థ ప్రతినిధులు మంత్రిని కలిసి తమ విస్తరణ ప్రణాళికను వివరించారు.

Ball Company
Ball Company (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 22, 2024, 11:07 AM IST

Ball Beverage Company Will Invest 700 Crores In Telangana : తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మరోసంస్థ ముందుకొచ్చింది. అల్యూమినియం టిన్నులను ఉత్పత్తిచేసే బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. రూ. 700 కోట్లతో యూనిట్‌ను స్థాపించడానికి సంసిద్ధత వ్యక్తంచేసినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

బీర్లు, శీతలపానీయాలు, పర్‌ఫ్యూముల ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను బాల్‌ సంస్థ సరఫరా చేస్తుంది. బాల్‌ ఇండియా కార్పొరేట్‌ వ్యవహారాల అధిపతి గణేశన్​తో పాటుగా సంస్థ ప్రతినిధులు ఆదివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. తమ సంస్థ విస్తరణ ప్రణాళికను వివరించారు. బాల్‌ సంస్థకు రాష్ట్రంలో అవసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. పెట్టుబడులకు సంబంధించి పూర్తిప్రణాళిక సమర్పించాలని సంస్థ ప్రతినిధులకు మంత్రి సూచించారు.

స్టాక్ మార్కెట్లో బాగా సంపాదించాలా? డివిడెండ్​ స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేయండిలా!

500 మందికి ఉపాధి అవకాశాలు: రాష్ట్రంలో బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌ సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీధర్‌బాబు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో బీర్ల ప్యాకేజింగ్‌లో టిన్నుల వాడకం 25 శాతం వరకు ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కానీ, తెలంగాణలో మాత్రం ఇది 2 శాతం లోపే ఉందని తెలిపారు. అవి కూడా మహారాష్ట్రలో బాట్లింగ్‌ అవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో అల్యూమినియం టిన్నుల్లో బీర్లను బాట్లింగ్‌ చేయడానికి ఎక్సైజ్‌ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని శ్రీధర్ బాబ తెలిపారు.

ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు: ఎక్సైజ్‌ విధానంలో మార్పులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులతో చర్చిస్తానని శ్రీధర్ బాబు తెలిపారు. 500 మి.లీ. పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్‌ చేయడం వల్ల కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో కోకాకోలా సంస్థ రూ.1000 కోట్లతో బాట్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు గతంలో సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆ యూనిట్‌కు ‘బాల్‌’ సంస్థ అల్యూమినియం టిన్నుల సరఫరాకు అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు.

హైదరాబాద్​ను న్యూయార్క్​ నగరంలా తీర్చిదిద్దాలి : సీఎం రేవంత్​ - cm revanth focus on hyderabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.