Bachupally Inter Student Suicide Case : బాచుపల్లిలోని నారాయణ కళాశాల వసతి గృహంలో ఆదివారం సాయంత్రం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలిసి కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు కాలేజీకి చేరుకునే లోపు మృతదేహాన్ని తరలించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల వద్ద నిరసనకు దిగారు. కాలేజీలో ఇబ్బందులు పెట్టడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాలపై దాడికి దిగారు.
రిసెప్షన్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కళాశాల నుంచి ఫిర్యాదు అందుకున్న బాచుపల్లి పోలీసులు అక్కడకు చేరుకొని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కానీ కొద్దిసేపు పోలీసులకు మృతురాలు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ కుమార్తెను ఆదివారం ఉదయం కళాశాలలో విడిచి ఇంటికి వెళ్లే లోపే ఇలా జరగడం జీర్ణించుకోలేని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అసలేం జరిగిందేంది :
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండవ కుమార్తె బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. దసరా సెలవులకు ఊరికి వెళ్లిన అమ్మాయిని, ఆదివారం తల్లిదండ్రులు కళాశాలలో దింపి వెళ్లారు. అంతలోనే కాలేజీ నుంచి హఠాత్తుగా ఓ కాల్ పిడుగులాంటి వార్తను మోసుకొచ్చింది. ఏం జరిగిందో తెలియదు గానీ అమ్మాయి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసింది.
ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులకు విషయం చెప్పకుండా మీ అమ్మాయి స్పృహ కోల్పోయింది అంటూ ఫోన్ కాల్ రావటం, తల్లిదండ్రులు కళాశాలకు చేరుకునే లోపలే మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడకు చేరుకొని కుమార్తె శవాన్ని చూసి కుప్పకూలిపోయారు. ఉరేసుకుని సూసైడ్ చేసుకుందని తెలిసి గుండెలవిసేలా రోదించారు. అంతకముందు వరకు నవ్వుతూ హాయిగా కనిపించిందని, ఇంతలోనే ఇంత దారుణానికి ఒడిగడుతుందని అనుకోలేదంటూ ఆ తల్లిదండ్రులు పెట్టిన రోదనలు అక్కడున్న వారితో కన్నీళ్లు పెట్టించాయి. ఈ విషయమై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి కళాశాలపై దాడికి దిగారు.
'కూతురు స్పృహ తప్పిందని ఫోన్ చేశారు - వెళ్లి చూస్తే ఉరేసుకుని చనిపోయింది'
కలసి ఉండలేమని తల్లడిల్లి ఏకంగా లోకాన్నే వీడి వెళ్లి - యువ ప్రేమికుల కన్నీటిగాథ