Ayodhya Ram Mandir Special Trains List : అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ పూర్తయింది. సామాన్య భక్తులకు ఈరోజు (జనవరి 23) నుంచి బాలరాముడి దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 29 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ఆస్తా ప్రత్యేక రైళ్లను కాజీపేట, సికింద్రాబాద్ నుంచి నడపనున్నారు. రాష్ట్రంలో పార్లమెంట్ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మంది చొప్పున అయోధ్య యాత్ర చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.
BJP Train From Secunderabad To Ayodhya Ram Mandir : ఈ ప్రత్యేక రైళ్లలో 20 బోగీలుంటాయి. ఒక్కో రైలులో 1,400 మంది ప్రయాణించవచ్చు. ప్రతి బోగికి ఒక ఇంఛార్జిని నియమిస్తోంది. అయోధ్యకు వెళ్లి రావడానికి 5 రోజుల సమయం పడుతుంది. అయోధ్యకు వెళ్లే ఉచిత రైళ్ల షెడ్యూల్‌ను బీజేపీ ప్రకటించింది. సికింద్రాబాద్, కాజీపేట రైల్వే స్టేషన్ల నుంచి ఈ రైళ్లు బయలుదేరనున్నాయి. భక్తుల కోసం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు 17 రోజుల పాటు ఈ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నారు.
BJP Train From Kazipet To Ayodhya : సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన భక్తులు సికింద్రాబాద్‌లో రైలు ఎక్కాల్సి ఉంటుంది. నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, నియోజకవర్గాలకు చెందిన వారు కాజీపేటలో ఆయా తేదీల్లో అందుబాటులో ఉండే రైలు ఎక్కాల్సి ఉంటుంది.
నియోజకవర్గాలు - రైళ్లు బయలుదేరే తేదీలు :
- సికింద్రాబాద్ - జనవరి 29
- వరంగల్ - జనవరి 30
- హైదరాబాద్ - జనవరి 31
- కరీంనగర్ - ఫిబ్రవరి 1
- మల్కాజిగిరి - ఫిబ్రవరి 2
- ఖమ్మం - ఫిబ్రవరి 3
- చేవెళ్ల - ఫిబ్రవరి 5
- పెద్దపల్లి - ఫిబ్రవరి 6
- నిజామాబాద్ - ఫిబ్రవరి 7
- ఆదిలాబాద్ - ఫిబ్రవరి 8
- మహబూబ్‌నగర్ - ఫిబ్రవరి 9
- మహబూబాబాద్ - ఫిబ్రవరి 10
- మెదక్ - ఫిబ్రవరి 11
- భువనగిరి - ఫిబ్రవరి 12
- నాగర్ కర్నూల్ - ఫిబ్రవరి 13
- నల్గొండ - ఫిబ్రవరి 14
- జహీరాబాద్ - ఫిబ్రవరి 15
Kazipet to Ayodhya Special Train : మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆస్తా ప్రత్యేక రైలును ఈనెల 30వ తేదీ నుంచి కాజీపేట, సికింద్రాబాద్‌ల నుంచి ప్రారంభించనుంది. కాజీపేట నుంచి అయోధ్యకు 07223 నెంబరు రైలు జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28వ తేదీల్లో, అయోధ్య నుంచి కాజీపేటకు ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2 తేదీల్లో ఈ రైలు భక్తులకు అందుబాటులో ఉండనుంది. ఉంటుందని వెల్లడించింది.
Hyderabad To Ayodhya Trains : సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు 07221 నెంబరుతో మరో ప్రత్యేక రైలు ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీలలో అందుబాటులో ఉంటుంది. అయోధ్య నుంచి ఇదే నెంబరుతో ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, మార్చి 1, 3 తేదీల్లో ఉంటుంది.