Attar Sales Boost Up In Hyderabad : హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో రంజాన్ సందర్భంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. పవిత్ర మాసాన్ని మరింత పరిమళంగా జరుపుకునేందుకు వివధ రకాల అత్తర్లు దుకాణాల్లో కొలువుతీరాయి. అవి సువాసనలు వెదజల్లడమే కాకుండా మనుసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. రంజాన్ మాసంలో ఈ ద్రవ్యాలు వాడేందుకు ముస్లింలు అధిక ప్రధాన్యం ఇస్తారు. సుమారు వందేళ్లకు పైగా అత్తర్లు వినియోగంలో ఉన్నట్లు నగరవాసులు చెబుతున్నారు. ముస్లింలు ప్రార్ధనలు చేసే సమయంలో వీటిని వాడుతారు. ముఖ్యంగా ప్రతి శుక్రవారం తప్పని సరిగా వినియోగిస్తారు. మారుతున్న కాలానికి అనుకూలంగా విభిన్న రకాల ఆకట్టుకునే సీసాల్లో ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
"రంజాన్ మాసంలో అత్తర్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ మాసంలో అందరు అత్తరు వేసుకుంటారు. ఈ రంజాన్ మాసంలో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అత్తరు వేసుకుని ఖురాన్ చదువుతారు. చాలా సంవత్సరాల నుంచి అత్తర్‌ను అందరూ వాడుతున్నారు. ముఖ్యంగా ప్రార్థనలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు అత్తరు వేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. వారికి ఇష్టానుసారంగా ప్లేవర్స్‌ను తీసుకుంటారు. కొందరు లైట్, స్వీట్ ఇలా తీసుకుంటారు." - వ్యాపారులు
చార్మినార్ నైట్ బజార్- పర్యాటకులతో నయా జోష్ - Charminar Night Bazaar
Attar Sales in Ramadan Season : 200లకు పైగా వివిధ రకాల సువాసనల పరిమళాలు నగరవాసులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ.40 నుంచి రూ.600 వరకు దొరుకుతున్నాయి. గులాబీ రేకులు, మల్లె, మొగలిపూలు, గంధం చెక్కలు మరిగించటం ద్వారా వచ్చే అవిరితోనే అత్తర్లను తయారు చేస్తారు. అత్తర్ ఎంత ఎక్కువ కాలం నిలిచి ఉంటే అంత ఎక్కువ సువాసనలు వెదజళ్లుతాయని వినియోగదారులు చెబుతున్నారు. ఇవి సువాసనతో పాటు ఆరోగ్యానికి మంచిదని వ్యాపారస్ధులు చెబుతున్నారు. రంజాన్ మాసంలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండుగకు మరో మూడు రోజులు ఉండటంతో అమ్మకాలు మరింత పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే చార్మినార్ పరిసరాలు జనంతో కిక్కిరిపోయాయి.
Attar Sales At Charminar : ముస్లింలతో పాటు ఇతరులు కూడా అత్తర్లు వాడటం ఇష్టపడతారు. ఏడాదంతా దొరకని వివిధ రకాల అత్తర్లు ఈ మాసంలో లభిస్తుంటాయి. వాటి కోసం ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. రంజాన్ మాసంలో వీటి విక్రయాలు అధికంగా ఉంటాయి. కొందరు వీటిని కొనుగోళు చేసి పండుగ సందర్భంగా ఇతరులకు బహుమానంగా ఇస్తుంటారు. మరికొందరు వీటి కలెక్షను హాబీగా పెట్టుకుంటారు. చార్మినార్ దగ్గర దొరికే వీటికి చాలా డిమాండ్ ఉంటుంది.
రంజాన్ స్పెషల్ ఫుడ్స్ ట్రై చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్లో ఫేమస్ హోటల్స్ ఇవే !