Attack On Vengal Rao Nagar BRS Corporator : హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ (BRS) కార్పొరేటర్ దేదీప్య రావుపై గత రాత్రి యూసఫ్ గూడ చెక్పోస్ట్ వద్ద స్థానిక మహిళలు దాడి చేశారు. గత రాత్రి జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ఫ్లెక్సీలు తొలగించే క్రమంలో కొంత ఇబ్బందులకు గురవ్వడంతో స్థానిక కార్పొరేటర్ అయిన దేదీప్యకు ఫోన్ చేశారు.
స్పందించిన కార్పొరేటర్ దేదీప్య అక్కడికి బయల్దేరగా దారిలో యూసఫ్ గూడ చెక్పోస్ట్ వద్ద మహిళలు అడ్డగించి ఆమెపై దాడికి పాల్పడ్డారు. మాగంటి గోపీనాథ అరాచకాలు ఎక్కువ అయిపోయాయంటూ స్థానిక మహిళలు ఆరోపించారు. స్వల్ప గాయాల పాలైన కార్పొరేటర్ జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేశారు.
రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆటోను జరపమన్నందుకు - ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై దాడి
తన భర్త విజయ ముదిరాజ్ స్థానిక కాంగ్రెస్ నాయకుల అండతో మహిళలను తనపైకి ఉసిగొలిపారని దేదీప్య ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భవాని అనే మహిళతో పాటు మరో ఇద్దరిపై కేసు పోలీసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా దేదీప్య మాట్లాడుతూ కొందరు కక్షపూరితంగా కావాలనే తనపై దాడికి పాల్పడ్డారని అన్నారు. తనపై దాడి జరుగుతున్నప్పుడు సుమారుగా 40 మందికి పైగా మహిళలు అక్కడ ఉండి వీడియో తీసి వైరల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా కార్పొరేట్ అయిన తనకు రక్షణ లేకుండా పోయిందని వెంగల్రావు నగర్ కార్పొరేటర్ దేదీప్య వాపోయారు. కొందరు తనపై దాడికి పాల్పడి అమానుషంగా ప్రవర్తించారని అన్నారు. కాంగ్రెస్ నాయకుల ప్లాన్లో భాగంగానే తనపై ఈ దాడి జరిగినట్లు ఆరోపించారు. రోడ్డు మీద ఓ మహిళపై దాడి జరుగుతుంటే చూస్తూ ఉన్నారు కానీ ఎవరూ స్పందించలేదని ఆవేదన చెందారు.
రైతు కూలీలపై ఏనుగు దాడి- త్రుటిలో తప్పించుకొన్న వ్యక్తి- లైవ్ వీడియో
కొందరు కాంగ్రెస్ నాయకులు కక్ష పూరితంగా వ్యవరించి నాపై దాడికి పాల్పడ్డారు. నాపై దాడి జరుగుతున్నప్పుడు అక్కడ కొందరు మహిళలు చూస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అదే సమయంలో అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కానీ ఎవరూ దాడిని ఆపలేదు. ఇదంతా కాంగ్రెస్ నేతల ప్లానే. వారి అండ చూసుకుని నా భర్త కొందరు మహిళలతో దాడి చేయించారు. - దేదీప్య, వెంకళ్రావ్నగర్ కార్పొరేటర్
ఆలేరులో ప్రచారం నిర్వహిస్తుండగా తేనెటీగల దాడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తప్పిన ప్రమాదం
బీఆర్ఎస్ అభ్యర్థి సునీత రెడ్డి వాహనంపై విపక్ష పార్టీ కార్యకర్తల దాడి