Atchennaidu Letter To Chief Electoral Officer: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా రాష్ట్రానికి సంబంధించిన యావత్ సమాచారం అందించే ఈ ఏపీ స్టేట్ పోర్టల్లో అధికార పార్టీ వైసీపీకి చెందిన నవరత్నాల పథకాల లోగో, అధికార పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలు, లింకులు యథాతథంగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిన 48 గంటల్లోగా అన్ని ప్రభుత్వ వెబ్ సైట్ల నుంచి రాజకీయ పార్టీ నేతల ఫొటోలు, ప్రచార సామగ్రిని తొలగించాలని ఈసీ ఆదేశించింది. అయినా ఇవేవీ సంబంధిత అధికారులకు పట్టటం లేదు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అప్రమత్తమైన అధికారులు- ముమ్మరంగా ఫ్లెక్సీల తొలగింపు
YSRCP Photos in Websites: ప్రభుత్వ శాఖల వైబ్‌సైట్లలో సీఎం జగన్, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని అచ్చెన్న తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచి ప్రభుత్వ వెబ్ పేజీల్లో రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫొటోలు ఉండరాదని లేఖలో అచ్చెన్న పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి రెండు రోజులైనా ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రాలు పలు వెబ్సైట్లల్లో దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. వీటిని తొలగించాలంటూ వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
రాజకీయ ప్రకటనల హోర్డింగ్‌లు, కటౌట్లు వెంటనే తొలగించాలి: ముఖేష్ కుమార్ మీనా
రాజకీయ ప్రకటనల హోర్డింగ్‌లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఎన్నికల అధికారులను సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర సచివాలయంలోని అధికారులు యదేఛ్చగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని అచ్చెన్న పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏపీ స్టేట్ పోర్టల్ నుంచి ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలను ఇంకా తొలగించటం లేదని, మోడల్ కోడ్ ఉల్లంఘిస్తే చర్యలుంటాయని ఈసీ హెచ్చరించినా అధికార యంత్రాంగం భేఖాతరు చేస్తుందని అచ్చెన్న మండిపడ్డారు. ఏపీలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర వివరాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర పోర్టల్ ద్వారా ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా దీన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలోని ఐటీ విభాగం నుంచే ఏపీ స్టేట్ పోర్టల్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా ఏపీ స్టేట్ పోర్టల్లో సంక్షేమ పథకాల వివరాలు, లింకులు ఇంకా కొనసాగుతున్నాయని అచ్చెన్న మండిపడ్డారు.
హింస, రీపోలింగ్ లేని ఎన్నికల నిర్వహణే లక్ష్యం: శంకబ్రత బాగ్చి