ETV Bharat / state

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ - బీఆర్​ఎస్​ ప్రయత్నాలు విఫలం - Lok Sabha Polls 2024

Aroori Ramesh Joined BJP : బీఆర్​ఎస్ మాజీ ఎమ్మెల్యే, వరంగల్​ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు. వరంగల్​ స్థానం తనకు కేటాయించకపోవడంతో ఆసంతృప్తితో ఉన్న ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

Aroori Ramesh Jumped into BJP
Aroori Ramesh Joins in BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 17, 2024, 11:48 AM IST

Updated : Mar 17, 2024, 2:46 PM IST

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ బీఆర్​ఎస్​ ప్రయత్నాలు విఫలం

Aroori Ramesh Joined BJP : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్​ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా శనివారం ఆయన బీఆర్​ఎస్​కు రాజీనామా చేశారు. ఆయన కాషాయ కండువా కప్పుకోవడంతో ఇన్ని రోజులు పార్టీ మారతారనే తతంగానికి ఎట్టకేలకు తెరపడింది. వరంగల్ పార్లమెంట్​ ఎంపీ సీటు ఆశించి ఆయన బీజేపీలో చేరినట్లు సమాచారం.

"భారత దేశంలో అన్ని వర్గాల అభివృద్ధితోపాటు, 30 సంవత్సరాల పోరాటం తర్వాత మోదీ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ అందుబాటులోకి వస్తుంది. అందుకే నేను బీజేపీలో చేరాను. మోదీ నాయకత్వంలో దేశ భద్రత 10 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా పాలన అందించారు. అవినీతిరహిత పాలనలో దేశం ముందుకు పోతుంది." - ఆరూరి రమేశ్​, బీజేపీ నేత

BRS Ex MLA Aroori Ramesh In BJP : వరంగల్ ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్న ఆరూరి రమేశ్​కు బీఆర్​ఎస్​ అధిష్ఠానం సీటు కేటాయించలేదు. అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ మారుతారన్న విషయం చక్కర్లు కొట్టింది. వరంగల్ పార్లమెంట్​ స్థానానికి ఆరూరి రమేశ్​ బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్లు ప్రచారం బాగా జరిగింది. ఇదే విషయం మీడియాకు వెల్లడించేందుకు ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన నివాసానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య వెళ్లారు. బీఆర్​ఎస్​ను నుంచి వెళ్లొద్దంటూ ఆరూరిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ​

బీఆర్​ఎస్​కు మరో షాక్ - చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి రాజీనామా - కాంగ్రెస్​లో చేరిక!

BRS Warangal MP Seat Issue : వారి ప్రయత్నలు విఫలమవడంతో బీఆర్​ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ (KCR Convinces Aroori Ramesh) రంగంలోకి దిగారు. రమేశ్​ను పిలిపించుకుని నచ్చజెప్పారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు బీజేపీతోనే అని భావించారు. బీజేపీ తరఫున వరంగల్​ ఎంపీ సీటు ఆశించిన ఆయనకే టికెట్​ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Kishan Reddy On BRS MLC Kavitha Arrest : ఆరూరి రమేశ్ పార్టీలో చేరిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై మరోసారి స్పందించారు. కవిత అరెస్టు బీజేపీ పార్టీకి, ప్రభుత్వానికి గానీ వ్యకిగత సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ కుటుంబనైనా, రాష్ట్రమైనా, బీజేపీ కార్యకర్తలైనా అవినీతి పరులైతే వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. కాంగ్రెస్​ 10ఏళ్ల కాలంలో రూ.12 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

"లిక్కర్ బిజినెస్​​తో బినామీ పేర్లతో వ్యాపారాలు చేసింది వాళ్లు. విమర్శలు మాత్రం బీజేపీ పైనా? కవిత పీఏలు గాని, బినామీలు అప్రూవర్​​గా మారి వివరాలు ఇస్తున్నారు. ఈడీ ఇండిపెండెంట్ సంస్థ దానికి అన్ని అధికారాలు ఉంటాయి." - కిషన్​ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

మరో రెండు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్​ఎస్​ - మల్కాజిగిరి బరిలో లక్ష్మారెడ్డి

కేసీఆర్​ ప్లాన్​​ ఛేంజ్​ - బహిరంగ సభలకు బైబై - బస్సు యాత్రలు, రోడ్​ షోలతోనే ఎన్నికల ప్రచారం

Last Updated : Mar 17, 2024, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.