ETV Bharat / state

గాడి తప్పిన ఆర్టీసీ - విలీనం చేసి చేతులు దులుపుకున్న జగన్‌ - అయిదేళ్లుగా నియామకాలు నిల్ - ఏపీఎస్ ఆర్టీసీ రిక్రూట్‌మెంట్

APSRTC Staff Recruitment: ఆర్టీసీ బస్సులో ఎక్కేవారు ఎక్కుతుంటారు! దిగేవారు దిగుతుంటారు! కానీ ఆర్టీసీ సంస్థలో దిగేవారే తప్ప ఎక్కేవారే కనిపించడంలేదు! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న జగన్‌ ఈ ఐదేళ్లలో సిబ్బంది నియామకాలే చేపట్టలేదు. సరైన శిక్షణ లేని తాత్కాలిక డ్రైవర్లకే స్టీరింగ్‌ అప్పగిస్తూ జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మొత్తంగా జగన్‌ జమానాలో ఆర్టీసీ బస్సు ప్రయాణం గాడితప్పింది.

APSRTC_Staff_Recruitment
APSRTC_Staff_Recruitment
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 10:32 AM IST

గాడి తప్పిన ఆర్టీసీ - విలీనం చేసి చేతులు దులుపుకున్న జగన్‌ - అయిదేళ్లుగా నియామకాలు నిల్

APSRTC Staff Recruitment: ప్రతీ ఆర్టీసీ డిపోలో నిత్యం 30 నుంచి 50 మంది ఆన్‌కాల్‌ డ్రైవర్లు హాజరవుతుంటారు. రెగ్యులర్‌ డ్రైవర్ల కొరతతో సరైన శిక్షణ లేని వీరికే బస్సులు అప్పగిస్తున్నారు. గ్యారేజీల్లో పూర్తిస్థాయిలో మెకానిక్‌లు లేక ఐటీఐ అప్రెంటీస్‌, పొరుగుసేవల కింద నియమితులైన వారే ఎక్కువ బస్సులకు మరమ్మతులు చేస్తున్నారు. రోడ్లపై గుంతల దెబ్బకు ఒక్కరోజు రోడ్డెక్కితేనే గుల్లగా మారే బస్సుల్ని బాగు చేయాల్సిన బాధ్యతా వీరిదే.

ఆర్టీసీ ప్రయాణికుల భద్రతపై జగన్‌ సర్కార్‌కు ఉన్న శ్రద్ధ ఏ పాటిదో చెప్పేందుకు ఈ రెండు ఉదాహరణలు చాలు! ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టని వైసీపీ ప్రభుత్వం సామాన్య, పేద ప్రయాణికుల బతుకుల్ని బలిపీఠం ఎక్కిస్తోంది. డ్రైవర్లు, మెకానిక్‌లే కాదు, సివిల్‌ ఇంజినీరింగ్, వైద్య, సెక్యూరిటీ, క్లరికల్‌ తదితర విభాగాల్లోనూ ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కారుణ్య నియామకాలు మినహా, ఐదేళ్లలో ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. సీఎం జగన్‌ ఒక్కసారి కూడా ఈ అంశంపై సమీక్ష నిర్వహించలేదు.

గుంతల రోడ్లు - కాలం చెల్లిన బస్సులు - ఆర్టీసీ సిబ్బందికి ఇక్కట్లు

2020 జనవరి 1న ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయ్యారు. అప్పటికి అన్ని విభాగాల్లో కలిపి 58 వేల 749 పోస్టులు ఉన్నట్లు తేలింది. ఐతే ఆ సమయానికి 51 వేల 488 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిని విలీనం చేస్తున్నట్లు చూపించింది. మరణించిన ఉద్యోగుల వారసుల్లో 1,126 మందిని కారుణ్య నియామకాల కింద తీసుకున్నారు.

వారిలో సగం మందిని ఆర్టీసీలోని వివిధ పోస్టుల్లో నియమించి మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర శాఖల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రస్తుతం ఆర్టీసీలో 49 వేల 335 మంది ఉద్యోగులే ఉన్నారు. అంటే వాస్తవంగా ఉండాల్సిన పోస్టుల్లో 9 వేల 414 పోస్టులు ఖాళీ! ప్రభుత్వం మాత్రం విలీన సమయంలో ఉన్న 51 వేల 488 ఉద్యోగులను పరిగణనలోకి తీసుకుని 2 వేల 153 పోస్టులే ఖాళీగా ఉన్నట్లు మభ్యపెడుతోంది.

ఆర్టీసీలోని మొత్తం సిబ్బందిలో 80శాతం డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్‌వైజర్ల పోస్టులే. మెకానికల్‌ సిబ్బంది 13 శాతం, మిగిలిన 7 శాతంలో సివిల్‌ ఇంజినీరింగ్, పర్సనల్, స్టోర్స్, అకౌంట్స్, మెడికల్, సెక్యూరిటీ విభాగాల సిబ్బంది ఉంటారు. ప్రధానంగా డ్రైవర్ల పోస్టుల కొరత ప్రమాదకరంగా పరిణమిస్తోంది. కారుణ్య నియామకాలు చేపట్టినా అందులో హెవీ వెహికల్‌ డ్రైవింగ్ లైసెన్స్‌ కలిగి ఉండి, డ్రైవర్‌ పోస్టుకు అర్హులైన వారు లేరు.

గతేడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు 259 ఆర్టీసీ బస్సు ప్రమాదాల్లో మరణాలు సంభవించాయి. వీటిలో పది గంటలకుపైగా డ్యూటీలో ఉన్న డ్రైవర్ల కారణంగా 102 ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. డ్రైవర్లకు ఓవర్‌ టైమ్‌ డ్యూటీలు, దూర మార్గాలకు కూడా ఒకే డ్రైవర్‌ను పంపడంతో ఒత్తిడి తీవ్రమై ప్రమాదాలు పెరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ట్రంలో నానాటికీ దిగజారుతున్న ఆర్టీసీ పరిస్థితి - సగానికిపైగా డొక్కు బస్సులే

సంస్థలో 3వేల 600 మంది డ్రైవర్లను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ అధికారులు కొన్ని నెలల క్రితం ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఓ వైపు పదవీ విరమణలు, మరోవైపు కొత్తగా 1,500 బస్సులను కొనుగోలు చేసిన దృష్ట్యా డ్రైవర్ల కొరత తీవ్రం కానుందని ప్రభుత్వానికి నివేదించారు. జగన్‌ సర్కారు మాత్రం డ్రైవర్ల భర్తీ దస్త్రాన్ని పక్కనపడేసింది.

ప్రస్తుతం ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో కలిపి ఏడు వేల మంది వరకూ పొరుగు సేవల సిబ్బంది ఉన్నారు. మెకానికల్, క్లరికల్, నిర్వహణ తదితర విభాగాల్లోని ఖాళీ పోస్టుల్లో పొరుగు సేవల సిబ్బందిని నియమించి వారితోనే నెట్టుకొస్తున్నారు. వారికి జీతాలను ఆర్టీసీయే చెల్లిస్తోంది. వీరి స్థానంలో రెగ్యులర్‌ ఉద్యోగులను నియమిస్తే వారికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే జగన్‌ ప్రభుత్వం ఖాళీల భర్తీ జోలికి వెళ్లడం లేదనే విమర్శలున్నాయి.

పేరుకే ప్రభుత్వంలో విలీనం - ఉద్యోగుల ప్రయోజనాలను హరించిన వైసీపీ ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.