ETV Bharat / state

కార్తికమాసం స్పెషల్ - పంచారామాలకు, శబరిమలకు ప్రత్యేక బస్సులు - APSRTC SPECIAL BUSES KARTHIKA MASAM

ప్రయాణికులకు ఏపీఎస్​ఆ​ర్టీసీ గుడ్‌న్యూస్

APSRTC Special Buses for Karthika Masam
APSRTC Special Buses for Karthika Masam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 29, 2024, 9:35 AM IST

APSRTC Special Buses for Karthika Masam : హిందూ పురాణాల్లో కార్తిక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. ఆలయాలన్నీ దీపాల కాంతుల్లో కళకళలాడుతుంటాయి. అత్యంత పవిత్రమైన కార్తిక మాసం నవంబర్​ 2వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఇది నవంబర్ 30న ముగుస్తుంది. ఈ నెలలో పరమ శివుడికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఈ నెలలో పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. అలాంటి వారి కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తోంది. ముందస్తు రిజర్వేషన్లు చేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌ సీహెచ్‌ సత్యనారాయణ పేర్కొన్నారు.

పంచారామ క్షేత్రాలకు : అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి పంచారామ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వచ్చే నెల 2 నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆదివారం డిపో నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరుతాయి. అమరావతి, భీమవరం, ద్రాక్షారామ, పాలకొల్లు, సామర్లకోట ఆలయాలకు తీసుకెళ్తారు. వచ్చేనెల 2, 3, 9, 10, 16, 23, 24 తేదీల్లో ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.

మన్యసీమ దర్శిని : ఈ బస్సులను వచ్చేనెల 3, 10, 17, 24 తేదీల్లో అందుబాటులో ఉంచారు. ఉదయం 5 గంటలకు డిపో నుంచి బయల్దేరి రాత్రి 8 గంటలకు తిరిగి చేరుకుంటాయి. ర్యాలి మోహిని అవతార కేశవస్వామి, కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి, సీతపల్లి బాపనమ్మ గుడి, రంప పురాతన శివాలయం, రాజమహేంద్రవరంలోని ఇస్కాన్‌ ఆలయం, మారేడుమిల్లి కాఫీ తోటలు, ఔషధ మొక్కలు, రబ్బరు తోటలు, జలతరంగిణి జలపాతం, పాములేరు వాగు సందర్శన ఉంటుంది.

శబరిమలై యాత్రకు : అమలాపురం డిపో నుంచి శబరిమల యాత్ర ఆరు రోజుల పాటు సాగనుంది. కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, పళని, ఎరుమేలి, శబరిమలై, కంచి, తిరుపతి, విజయవాడ ఆలయాలను దర్శించుకుంటారు. 7, 8, 10, 12 రోజుల యాత్రలకూ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కోరుకున్న ప్రాంతాల నుంచే బస్సులు నడిపేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.

APSRTC Special Buses for Karthika Masam
టికెట్ల ధరలు (ETV Bharat)

కార్తికమాసం స్పెషల్​ - అరుణాచలం TO తంజావూర్ - రూ.14వేలకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

కార్తికమాసం స్పెషల్​ - శైవక్షేత్రాలకు 350 ప్రత్యేక బస్సులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.