ETV Bharat / state

డీసీఎంను ఢీకొట్టిన ఆర్టీసీ లగ్జరీ బస్సు - మంటలు చెలరేగి చూస్తుండగానే దగ్దం - ప్యాసింజర్స్​ సేఫ్ - BUS Fire Accident In Mahabubnagar

BUS Fire Accident In Mahabubnagar : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలో బస్సు-డీసీఎం వాహనం ఒ ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా, 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్‌ స్తంభించింది.

BUS Fire Accident In Mahabubnagar
BUS Fire Accident In Mahabubnagar (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 12:22 PM IST

BUS Fire Accident In Mahabubnagar : జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 1.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపోనకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు, ఆదివారం రాత్రి 12 గంటలకు హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది.

ఢీకొన్న బస్సు, డీసీఎం : జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి మలుపు వద్దకు చేరుకోగానే సరకు రవాణా వాహనం డీసీఎం యూటర్న్‌ తీసుకునేందుకు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు, డీసీఎంను ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి కుడివైపు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. డ్రైవర్, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన మిగతా ప్రయాణికులు, అద్దాలు పగులగొట్టుకుని బయటకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు.

ప్రమాదంలో బస్సు దగ్ధం : విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడి ప్రయాణికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈలోగా బస్సులో మంటలు చెలరేగి, చూస్తుండగానే తీవ్రమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 2.30 గంటల వరకు బస్సు పూర్తిగా దగ్ధమైంది. 108 సిబ్బంది క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులు అప్రమత్తమై బస్సు నుంచి బయటకు రాకపోతే అంతా అగ్నికి ఆహుతయ్యే వారన్న ఆందోళన వ్యక్తమైంది.

ప్రయాణికులకు గాయాలు : ఆసుపత్రిలో అనంతపురానికి చెందిన లక్ష్మీదేవి, సంజీవ, సునీల్, గాయత్రి, కూకట్​పల్లికి చెందిన మోహన్‌, హైదరాబాద్‌కు చెందిన మైథిలి, హీరాలాల్‌, అర్చన, నంధ్యాలకు చెందిన కార్తీక్, దస్తగిరితో పాటు మరికొందరు ప్రయాణికులు చికిత్స పొందుతున్నారు. 15 మందికి పైగా క్షతగాత్రులు ఉండగా, అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు, 108 సిబ్బంది తెలిపారు. బస్సు దూసుకెళ్లిన చోట విద్యుత్తు తీగలు కిందకు ఉన్నాయి. అయితే మంటలు చెలరేగడానికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.

లారీని ఢీకొన్న అంబులెన్స్ - ఆరుగురు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు - West Bengal Road Accident

స్కూటీని తప్పించబోయి కారును ఢీ కొట్టిన కంటైనర్‌ - సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు - Road Accident in Choutuppal

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.