ETV Bharat / state

సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు- ఆందోళనలు, ర్యాలీలతో హోరెత్తిన రాష్ట్రం

APJAC Leaders Protest to Resolve Problems: సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. పాదయాత్రలో సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

APJAC_Leaders_Protest_to_Resolve_Problems

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 6:23 PM IST

Updated : Feb 17, 2024, 9:50 PM IST

సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు- ఆందోళనలు, ర్యాలీలతో హోరెత్తిన రాష్ట్రం

APJAC Leaders Protest to Resolve Problems: డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. విజయవాడ ధర్నాచౌక్‌ వద్ద ఏపీ ఐకాస ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నాలుగేళ్లుగా సమస్యలపై పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఉద్యోగులు మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌ వద్ద ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. గుంటూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. నిరసనలో బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. జగన్‌ నాలుగేళ్లుగా ఉద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

తమకు న్యాయంగా రావలసిన 12వ పీఆర్సీ, బకాయి డీఏలు, ఇవ్వాలని కోరడం నేరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చివరకు ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు కూడా ఇవ్వటం లేదన్నారు. పీఆర్సీ కోసం పోరాటం చేస్తే ఇంతవరకు వాటిని సైతం ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. నాలుగున్నరేళ్ళుగా ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తూనే ఉందన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వంపై రగులుతున్న ఉద్యోగ సంఘాలు - 22న ఉద్యమ కార్యాచరణ

ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్డీవో కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘాల నేతలు ధర్నా నిర్వహించి, అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంయుక్త కార్యచరణ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరికి రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

కడపలో మహవీర్‌ సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి, అక్కడ ఆందోళన తెలిపారు.

డిమాండ్లు పరిష్కరించని ఏ ప్రభుత్వమూ తిరిగి అధికారంలోకి రాలేదు: ప్రభుత్వ ఉద్యోగులు

ఏలూరులో ఏపీ ఎన్జీవో సంఘం ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ర్యాలీగా వెళ్లి, కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం తహసీల్జార్‌ కార్యలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నేతలు ఒ‍కరోజు నిరశన కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తే ఆందోళన తప్పదని ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరించింది. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో జేఏసీ ఆందోళన చేపట్టింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

ఉద్యోగులకు రూ. 20 వేల కోట్ల బకాయిలు- చర్చలు నిరుత్సాహపరిచాయి, ఉద్యమం కొనసాగుతుంది: ఉద్యోగ సంఘాలు

మరోవైపు సీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఉద్యోగులకు అనుమతులు ఇవ్వలేమన్నారు. విజయవాడలో సెక్షన్ 30, 144 అమలులో ఉన్నాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరించారు. చలో విజయవాడకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై ఏపీసీపీఎస్​ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియాదాస్ అసహనం వ్యక్తం చేశారు. తాము ఏమన్నా సంఘ విద్రోహ శక్తులమా? టెర్రరిస్టులమా? అని ప్రశ్నించారు.

Last Updated : Feb 17, 2024, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.