APERC on Fuel Purchase Adjustment Charges: ఇంధన కొనుగోలు సర్దుబాటు ఛార్జీలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ డిస్కంలు దాఖలు చేసిన ట్రూ అప్ ఛార్జీలపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సూచనలు కోరింది. విద్యుత్ ఎక్స్‌చేంజ్‌లో భాగంగా 2023-24లో అధిక ధరలకు కొనుగోలు చేసిన విద్యుత్‌కు ట్రూ అప్ ఛార్జీల విధింపును కోరుతూ డిస్కంలు ఏపీ ఈఆర్సీకి (Andhra Pradesh Electricity Regulatory Commission) ప్రతిపాదన చేశాయి. బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలుకు రూ.6.50 రూపాయల వరకూ వ్యయమైందని డిస్కంలు తెలిపాయి.
2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు కొనుగోలు చేసిన విద్యుత్‌కు సర్దుబాటు ఛార్జీలు విధించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. డిస్కంల ప్రతిపాదనల మేరకు యూనిట్ విద్యుత్‌కు ప్రతి నెలా విద్యుత్ కొనుగోలు సర్దుబాటు ఛార్జీలుగా 40పైసలు విధించేందుకు ఏపీ ఈఆర్సీ నిర్ణయించింది. ఈ నెల 19లోగా ప్రజలు తమ అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతూ ఏపీ ఈఆర్సీ బహిరంగ ప్రకటన విడుదల చేసింది.
అఘాయిత్యాలు ఇంకా కొనసాగితే నేనే హోంమంత్రి అవుతా - పోలీసులు ఏం చేస్తున్నారు? : పవన్ కల్యాణ్
క్రీడాకారులకు భారీగా ప్రోత్సాహకాలు! - నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష