ETV Bharat / state

నేటి నుంచి 'టెట్' పరీక్షలు - అభ్యర్థులు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే! - AP TET 2024 Exams - AP TET 2024 EXAMS

AP TET 2024 Exams : ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్​ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడంతో ఈసారి టెట్‌కు పోటీ పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

AP TET 2024 Exams
AP TET 2024 Exams (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2024, 7:40 AM IST

TET Exams in AP 2024 : ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్‌కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 21 వ వరకు 17 రోజుల పాటు ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్-1 నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్ -2 నిర్వహిస్తారు. దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయిస్తారు.

108 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు : ఈసారి ఏపీ వ్యాప్తంగా 108 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని 22 జిల్లాలో 95 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా హైదరాబాద్ , ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాంలలో కలిపి 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లోని కేంద్రాల్లో 24,396 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

పరీక్ష సమయానికి గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు తప్పని సరిగా ఆధార్ ​కార్డు, డ్రైవింగ్​ లైసెన్స్, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకదాన్ని వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సెల్​ఫోన్, ట్యాబ్, ల్యాప్​టాప్, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా, ఫొటో చిన్న సైజులో ఉన్నా అభ్యర్థి 2 పాస్​పోర్ట్ సైజు ఫొటోలను తీసుకుని సంబంధిత డిపార్ట్​మెంట్​ అధికారికి సమర్పించి అనుమతి పొందాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. హాల్​టికెట్లలో ఏవైనా తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని డిపార్టుమెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు.

పరీక్షల్లో ఎక్కడా అవకతవకలు, అక్రమాలు జరగకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్, జిల్లా పరిశీలకులు, తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ఆన్​లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తుండటం వల్ల విద్యుత్ సరఫరా సహా సాకేంతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు సహా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్షకు హాజరైనా, మాల్ ప్రాక్టీస్​కు పాల్పడినా అభ్యర్థిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

AP TET 2024 : ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన రోజే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. డీఎస్సీకి పోటీ పడాలంటే అభ్యర్థులు తప్పని సరిగా టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు సైతం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టెట్‌కు 4,27,300మంది దరఖాస్తు చేయగా ఇప్పటివరకు 4,13,000ల మంది అభ్యర్థులు హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకున్నారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌ - రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - RRB Technician Jobs 2024

SBI భారీ నోటిఫికేషన్‌ - 1511 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ - దరఖాస్తుకు మరో 3రోజులే ఛాన్స్‌! - SBI SO Recruitment 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.