ETV Bharat / state

ఏలూరు టూ దిల్లీ ఎర్రచందనం జర్నీ- దొరికిన దుంగల దొంగలు - Red Sandalwood Smugglers Arrested

AP Police Arrested Red Sandalwood Smuggling Gang in Eluru District : రాష్ట్రంలో రోజురోజుకీ స్మగ్లర్ల దందా పెరిగిపోతోంది. అక్రమంగా ఇసుక, గ్రావెల్​, మద్యం, గంజాయి తరలిస్తున్న వారు చెలరేగిపోతున్నారు. కంటెయినర్​లో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా గురువారం పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో నిఘా పెట్టి స్మగ్లర్ల ఆట కట్టారు.

ap_police_arrested_red_sandalwood_smuggling_gang_in_eluru

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 1:30 PM IST

ఏలూరు టూ దిల్లీ ఎర్రచందంనం జర్నీ- దొరికిన దుంగల దొంగలు

AP Police Arrested Red Sandalwood Smuggling Gang in Eluru District : రాష్ట్రంలో రోజురోజుకీ స్మగ్లర్ల అక్రమాలు పెరిగిపోతున్నాయి. అక్రమంగా ఇసుక, గ్రావెల్​, మద్యం, గంజాయి తరలిస్తున్న వారు చెలరేగిపోతున్నారు. పోలీసులకు చిక్కికుండా మాస్టర్​ ప్లాన్లు వేస్తూ అక్రమ రవాణాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో రెచ్చిపోయిన ఎర్రచందనం (Red Sandalwood ) స్మగ్లర్​ మంచి ప్రణాళికతో దుంగలు తరలించానుకున్నా చివరకు అనుకోని సంఘటన చోటు చేసుకుంది.

ఎర్రచందనం స్మగ్లర్​కు అసెంబ్లీ సీటు! - వైసీపీ సర్కార్ అండతో జోరుగా దందా

Red Sandalwood Smugglers Arrested : కంటెయినర్​లో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తుండగా గురువారం ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో నిఘా పెట్టారు. టి. నరసాపురం మండలం బంధంచర్ల నుంచి ఎర్ర చందనాన్ని దిల్లీకి తరలిస్తున్నారు. అటవీశాఖ అధికారులు (Forest officials) తెలిపిన వివరాల ప్రకారం దిల్లీకి (Delhi) చెందిన ప్రేమ్​సింగ్ అనే వ్యాపారి బంధంచర్లకు చెందిన రైతు (Farmer) వాసిరెడ్డి మోహనరావు వద్ద సుమారు 100 ఎర్ర చందనం చెట్లు కొనుగోలు చేశారు. వీటిని నరికి దుంగలుగా చేశారు. కంటెయినర్లో సుమారు నాలుగున్నర టన్నుల ఎర్ర చందనం దుంగలను బుధవారం రాత్రి లోడు చేశారు.

"ఎర్రచందనంను రైతులు సొంత ప్రదేశాల్లో సాగు చేయవచ్చు - ఎగుమతికి ఎలాంటి నిబంధనలు ఉండవు"

Red Sandalwood Smuggling Gang Arrested : ఇవి పైకి కనిపించకుండా కొంత భాగం వరకు పాత ఫర్నీచర్​ను పెట్టి ఒక ప్లాన్ ప్రకారం తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ రవికుమార్, ఎస్సై సతీశ్ తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. కంటెయినర్​ బందచర్ల నుంచి వచ్చేసరికి వారిని పోలీసులు (Police) పట్టుకున్నారు. కంటెయినర్​తో పాటు ఒక కారు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీటిని డిప్యూటీ రేంజర్ కె. వి. రామలింగాచార్యులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి.రాజు, ఏలూరు టాస్క్ ఫోర్స్ డిప్యూటీ రేంజర్ రంజిత్ కుమార్లకు అప్పగించారు. వారు సిబ్బందితో కలిసి ఎర్ర చందనం దుంగలను వ్యాన్లో నుంచి కిందకు దింపి కొలతలు తీసుకుని తూకం వేశారు. వీటి విలువ గ్రేడ్​ని బట్టి నిర్ధారించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. కేసు (Case) నమోదు చేసినట్లు చెప్పారు.

వైసీపీ సర్కారు నిర్లక్ష్య వైఖరి, వృధాగా డిపోల్లో ఎర్రచందనం నిల్వలు

ఎర్రచందనం తరలిస్తున్న ఐదుగురి అరెస్టు, నాలుగు కోట్ల విలువైన 275 దుంగలు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.