ETV Bharat / state

ఏపీ ప్రజలకు అలర్ట్ - జనవరి​ 1 నుంచి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు! - REGISTRATION CHARGES HIKE IN AP

రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం - పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువల అమలు

Registration Charges Hike in AP
Registration Charges Hike in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Registration Charges Hike in AP : రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి కొత్త విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఇతర అంశాల ప్రాతిపదికన ప్రసుత్తం ఉన్న దానిపై 10 శాతం నుంచి 15 శాతం వరకు విలువలు పెరిగే అవకాశం ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగా అసమానతలు లేకుండా శాస్త్రీయ విధానంలో విలువల పెంపు జరిగేలా కసరత్తు చేస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ విలువలతోపాటు నిర్మాణ(స్ట్రక్చర్‌) విలువలు కూడా సవరిస్తున్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పర్యవేక్షణలో నిర్దిష్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా సిద్ధంచేసే విలువల సవరణ ప్రతిపాదనలకు జిల్లా కమిటీలు ఆమోదిస్తాయి. అనంతరం ఈ నెల 20న సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచుతారు. వీటిపై ఈ నెల 24 వరకు సలహాలు/అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. వీటి పరిశీలన ఈ నెల 27 వరకు జరుగుతుంది.

2025 జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమలు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్లను ఆదేశిస్తూ రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. వైఎస్సార్సీపీ సర్కార్ రిజిస్ట్రేషన్‌ విలువల పెంపులో నిర్దిష్టమైన విధానాలు పాటించకపోవడంతో క్షేత్రస్థాయిలో అసమానతలు చోటుచేసుకున్నాయి. ఎన్డీయే ప్రభుత్వ చర్యలతో ఇవి తొలగనున్నాయి.

హైడ్రా ఎఫెక్ట్! - రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి గండి - రూ.300 కోట్లు లాస్

రైతులకు అలర్ట్ - ఈ-పంట నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్నారా? లేకుంటే అంతే సంగతులు! - government on e crop registrations

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.