ETV Bharat / state

ప్రపంచస్థాయి వసతులతో ఏపీ మారిటైమ్ పాలసీ - ప్రపంచంలోని 20 భారీ పోర్టుల్లో ఒకటి ఇక్కడే - AP MARITIME POLICY

2024-29 ఏపీ మారిటైమ్ పాలసీ విడుదల చేసిన ప్రభుత్వం - 2047 నాటికి దేశంలోని కార్గోలో 20 శాతం ఏపీలోనే నిర్వహించేలా కార్యాచరణ

AP_Maritime_Policy
AP Maritime Policy Released (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 6:43 PM IST

Updated : Dec 11, 2024, 8:37 PM IST

AP Maritime Policy Released : 2024-29 ఏపీ మారిటైమ్ పాలసీని ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో పోర్టు ఆధారిత అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, లాజిస్టిక్స్, ఇతర మారిటైమ్ సేవలు అందించేలా నూతన పాలసీని రూపొందించారు. ఏపీ మారిటైమ్ విజన్​ను ఆవిష్కరించటంతో పాటు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా ప్రభుత్వం కొత్త విధానం రూపొందించింది. సుదీర్ఘమైన తీరప్రాంతం, వ్యూహాత్మకంగా అనువైన ప్రాంతాన్ని పోర్టులు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి వినియోగించేలా విధాన రూపకల్పన చేసింది. 2030 నాటికి భారత మారిటైమ్ గేట్ వేగా ఏపీని మార్చేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టింది.

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కొత్త విధానం: ప్రపంచ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాలు కల్పించేలా విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. కార్గో హ్యాండ్లింగ్ సామర్ధ్యాలను పెంపోందించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. పోర్టుల పరిధిలోని ప్రాంతాలను పారిశ్రామిక, లాజిస్టిక్ క్లస్టర్లుగా అభివృద్ధి చేయటంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా కొత్త విధానం ఉండనుంది. షిప్ యార్డులు, షిప్ బిల్డింగ్, మరమ్మతులు చేపట్టేలా కార్యాచరణతో పాటు అనుబంధ మారిటైమ్ సేవలు అందించేలా కొత్త విధానం ఉండనుంది.

ప్రపంచంలోని 20 భారీ పోర్టుల్లో ఒకటి ఏపీలో ఉండేలా: ప్రపంచంలోని 20 భారీ పొర్టుల్లో ఒకటి ఏపీలో ఉండే విధంగా సామర్ధ్యం పెంపు లక్ష్యంగా కొత్త మారిటైమ్ పాలసీ రూపొందింది. 2047 నాటికి దేశంలోని పోర్టుల్లో నిర్వహిస్తున్న మొత్తం కార్గోలో 20 శాతం ఏపీలోనే నిర్వహించేలా కార్యాచరణ చేపట్టింది. నౌకల టర్న్ అరౌండ్ సమయాన్ని 15 గంటల కంటే తక్కువకు తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. పోర్టు సంబంధిత వ్యవహారాల్లో 5 వేల మంది నిపుణులను 2028 సంవత్సరం నాటికల్లా తయారు చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. మారిటైమ్ పాలసీ అమలుకు ఏపీ మారిటైమ్ బోర్డును నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ ఉత్తర్వులు ఐ అండ్ ఐ శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ జారీ చేశారు.

'సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేద్దాం' - మారిటైమ్ హబ్‌గా ఏపీ

Last Updated : Dec 11, 2024, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.