AP High Court on Prathipati Sarath Police Custody Petition : పన్ను ఎగవేత, డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు ఆరోపణల కేసులో తెలుగుదేశం పార్టీ నేత ప్రతిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) కుమారుడు ప్రత్తిపాటి శరత్‌ను పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. పన్ను ఎగవేసి ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేకూర్చారనే ఆరోపణలతో డీఆర్ఐ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు ఇటీవలే కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ప్రత్తిపాటి శరత్‌ను అరెస్ట్ చేశారు. మరింత లోతుగా విచారించేందుకు శరత్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు తొలుత కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన విజయవాడ కోర్టు పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో పోలీసులు హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లారు. పోలీసుల పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆ వ్యాజ్యాన్ని కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ప్రత్తిపాటి కుటుంబం - కష్టడీకి పోలీసులు అప్పీల్
Prathipati Sarath Bail Petition Hearing : పన్ను ఎగవేత, డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు ఆరోపణల కేసులో ప్రత్తిపాటి శరత్ బెయిల్ పిటిషన్‌పై విజయవాడలోని ఒకటో ఏసీఎంఎం కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కోర్టు పీపీ బి. సత్యనారాయణ తన వాదనలు వినిపించారు. ప్రతిపాటి శరత్‌ను ఇంకా పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉందని అన్నారు.
తీర్పు రిజర్వు - ఈ నెల 14వ తేదీ వెల్లడి? : అవెక్సా కార్పొరేషన్ ద్వారా పాల్పడిన అవకతవకలకు సంబంధించి లోతుగా ప్రశ్నించి వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఈ దశలో బెయిల్ ఇస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని పీపీ వాదించారు. దర్యాప్తును విజయవాడ పోలీసుల నుంచి సీఐడీకి బదిలీ అయిందని, ఈ దృష్ట్యా కేసు విచారణ పరిధిని సీఐడీ న్యాయస్థానానికి మార్చాలని న్యాయాధికారి ఎదుట తన వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు.
శరత్ అరెస్టు అక్రమం - ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్య: టీడీపీ
Prathipati Pullarao Son Sharat in Police Custody : జీఎస్టీ అధికారుల ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు ప్రత్తిపాటి శరత్‌ను ఫిబ్రవరి 29న హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. శరత్‌ను విజయవాడ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారించారు. శరత్‌పై జీఎస్టీ విభాగం మనీలాండరింగ్, పన్ను ఎగవేత అభియోగాలు మోపింది. ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120 బీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద శరత్‌పై మాచవరం పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ప్రత్తిపాటి కుమారుడు, భార్య, బావమరిది సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు సీపీ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్ధృతంగా మారింది. సీపీ కార్యాలయానికి వచ్చిన గద్దె రామ్మోహన్, టీడీపీ నేతలు చేరుకున్నారు. పోలీసులు సీపీ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించలేదు.