ETV Bharat / state

జగన్‌కి జడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత కల్పిస్తున్నాం: ఎస్‌ఎన్‌ విశ్వనాథ్‌ - AP High Court on Jagan Security

AP HC on Jagan Security: మాజీ సీఎం జగన్‌కి జడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత కల్పిస్తున్నామని, 58 మంది సిబ్బంది రక్షణగా ఉన్నారని రాష్ట్ర స్థాయి భద్రత రివ్యూ కమిటీ సభ్యులు, ఐపీఎస్‌ అధికారి ఎస్‌ఎన్‌.విశ్వనాథ్‌ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. భద్రతపై ఆందోళన ఉంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలి తప్ప హైకోర్టులో వ్యాజ్యం వేయడానికి వీల్లేదన్నారు. తనకు ముప్పు ఉన్నట్లు ఆధారాలతో అధికారులకు జగన్‌ ఎలాంటి వినతి ఇవ్వలేదన్నారు. హానికర ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. వ్యాజ్యం దాఖలు చేయడానికి ఇతర కారణాలున్నట్లు కనిపిస్తున్నాయన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని జగన్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు.

AP HC on Jagan Security
AP HC on Jagan Security (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 9:18 AM IST

AP HC on Jagan Security : తాను సీఎంగా ఉన్నప్పుడు ఎంత మంది భద్రత సిబ్బందిని ఇచ్చారో దానిని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం జగన్‌ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసులో ఎస్‌ఆర్‌సీ సభ్యులు, ఐపీఎస్ అధికారి ఎస్​ఎన్​ విశ్వనాథ్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. ఎల్లో బుక్‌ మార్గదర్శకాల ప్రకారం జడ్‌ప్లస్‌ కేటగిరి వ్యక్తికి 58 మంది భద్రత సిబ్బందిని ఇస్తారని కౌంటర్‌లో తెలిపారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో 2023లో తీసుకొచ్చిన ఏపీ స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ చట్టం ప్రకారం జడ్‌ప్లస్‌ భద్రత సిబ్బందికి అదనంగా సిబ్బందిని కల్పించారని తెలిపారు.

ఈ ఏడాది ఎన్నికల్లో జగన్‌ పరాజయం పాలవడంతో సీఎం పదవి కోల్పోయారని, ఈ నేపథ్యంలో అదనపు భద్రత సిబ్బందిని పొందే విషయంలో జగన్, ఆయన కుటుంబ సభ్యులకు 2023లో తెచ్చిన చట్టం వర్తించదని కోర్టుకు వివరించారు. అదనపు భద్రత సిబ్బందిని పొందడానికి వారు అనర్హులని స్పష్టం చేశారు. ఈ విషయాలను దాచిపెట్టి హైకోర్టులో వ్యాజ్యం వేశారని, సీఎం నుంచి ఎమ్మెల్యే స్థాయికి మారినప్పటికీ జగన్‌కు ఈ ఏడాది జులై 20 వరకు గతంలో ఇచ్చిన భద్రతనే కొనసాగించామని పేర్కొన్నారు.

జగన్ మోహన్ రెడ్డికి 950 మందితో భద్రత ఎందుకు? - నెలకి ఎన్ని కోట్లు ఖర్చవుతుందో తెలుసా? : హోం మంత్రి - Home Minister On Jagan Security

రాష్ట్రస్థాయి ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ కమిటీ జులై 16న సమావేశం నిర్వహించిందని, కొత్తగా ఎంపికైన ఎంపీ, ఎమ్మెల్యేల స్థాయి ఆధారంగా భద్రతను కల్పించాలని సిఫారసు చేసిందని తెలిపారు. ఎన్నికల్లో ఓటమిపాలైన నాయకులకు గతంలో కల్పించిన పొజిషన్‌ ఆధారిత భద్రతను ఉపసంహరించాలని తీర్మానించిందని జగన్‌ విషయంలో మాత్రం జడ్‌ప్లస్‌ కేటగిరిని కొనసాగించాలని నిర్ణయించిందని కౌంటర్‌ స్పష్టం చేశారు.

వాస్తవానికి ఎమ్మెల్యేగా జగన్‌ 1+1 భద్రత పొందేందుకు అర్హులని, గతంలో మాదిరి జడ్‌ప్లస్‌ భద్రతతోపాటు బుల్లెట్‌ రెసిస్టెంట్‌ అలాగే కొనసాగుతోందన్నారు. మూడు షిఫ్ట్‌లలో ఇద్దరు పర్సనల్‌ సెక్యూరిటీ అధికారులు ప్రస్తుతం భద్రత పర్యవేక్షణను చూస్తున్నారని కోర్టుకు వివరించారు. వీఐపీల భద్రతను కేవలం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సంఖ్యను బట్టి చూడకూడదని భద్రత విధుల నిర్వహణలో మానవ వనరులను తగ్గించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదపడుతోందని అధికారి తన కౌంటర్‌లో తెలిపారు. 2014లో ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవి విడిచిపెట్టాక వై కేటగిరి సెక్యూరిటీ మాత్రమే పొందుతున్నారని కూడా కౌంటర్‌లో స్పష్టం చేశారు.

జగన్ గన్​మెన్లను అడుగుతున్నది భద్రత కోసమా, స్టేటస్ కోసమా?: తులసిరెడ్డి - tulasi reddy on ys jagan security

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై రిప్లై కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని జగన్‌ తరఫు న్యాయవాది సుమన్‌ కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి విచారణను ఈనెల13కు వాయిదా వేశారు.

పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం, పీఎం తరహా సెక్యూరిటీ ఉండదు : మంత్రి కొల్లు రవీంద్ర - Kollu Ravindra Fires on Jagan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.