AP Govt Removed Gajjala Venkata Lakshmi As Woman Commission Chairman : ఫక్తు వైఎస్సార్సీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి నుంచి గజ్జల వెంకటలక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 25న ముగిసిన నేపథ్యంలో ఆమె అధికారాలను, కార్యాలయంలోని ఛాంబర్‌ను సీజ్ చేస్తూ మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి ఉత్వర్వులు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కార్యదర్శికి ఆదేశాలిచ్చారు.
ఆగస్టు 25తో వెంకటలక్ష్మి పదవీకాలం ముగిసిందని మహిళా శిశు సంక్షేమశాఖ పేర్కొంటుండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళా కమిషన్‌కు చేసిన చట్ట సవరణ ప్రకారం తనకు ఇంకా ఏడాదిన్నర కాలపరిమితి ఉందని ఆమె భీష్మించారు. కార్యాలయాన్ని వీడేందుకు ససేమిరా అన్నారు. న్యాయ శాఖ, అడ్వకేట్ జనరల్ సలహా తీసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా కమిషన్ చట్టం ప్రకారం వెంకటలక్ష్మి పదవీకాలం ముగిసినట్టు నిర్ధారించుకున్నారు. ఆమె అధికారాలను సీజ్ చేస్తూ మెమో ఇచ్చింది. దీంతో వెంకటలక్ష్మి కార్యాలయాన్ని మహిళా కమిషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మాగుంట కుటుంబంలో విషాదం - మాజీ ఎంపీ పార్వతమ్మ మృతి - Magunta Parvathamma Passed Away
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం ప్రకారం మహిళా కమిషన్‌లో ఛైర్మన్ లేదా సభ్యులను పదవీకాలం ముగియక ముందే తొలగించినా లేదా వారే రాజీనామా చేసినా కొత్తగా నియమితులయ్యే వారు మిగతా పదవీకాలం మాత్రమే కొనసాగుతారు. గత ప్రభుత్వ హయాంలో వాసిరెడ్డి పద్మ స్థానంలో నియమితురాలైన వెంకటలక్ష్మికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని మహిళా శిశు సంక్షేమశాఖ మెమోలో స్పష్టం చేసింది.