ETV Bharat / state

వరద నష్టంపై ఏపీ సర్కార్ రిపోర్టు - బాధితులకు సాయం చేయాలనుకుంటున్నారా? - AP FLOOD DAMAGE REPORT 2024 - AP FLOOD DAMAGE REPORT 2024

AP Flood Damage Report 2024 : భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి చెందగా, 1,69,370 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపింది. వరదల వలన 22 సబ్ స్టేషన్​లు దెబ్బతినగా, 3,312 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించింది. 78 చెరువులకు, కాలువలకు గండ్లు ఏర్పడగా, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టపోయారని ప్రభుత్వం తెలిపింది.

AP Flood Damage Report 2024
AP Flood Damage Report 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 1:30 PM IST

AP Flood Damage Report 2024 : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది మృతి చెందిన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 12 మంది మృతి చెందగా, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందిన్నట్లు అధికారులు తెలిపారు. 1,69,370 ఎకరాల్లో వివిధ పంటలు, 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిళ్లిన్నట్లు వెల్లడించారు. దీంతో 2లక్షల34 వేల మంది రైతులు నష్టపోయారని అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టం : అలాగే 60 వేల కోళ్లు, 222 పశువులు మృతి చెందిన్నట్లు ప్రకటించారు. వరదల వలన 22 సబ్ స్టేషన్​లు దెబ్బతినగా, 3,312 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు. 78 చెరువులకు, కాలువలకు గండ్లు ఏర్పడ్డాయని వెల్లడించారు. వర్షం, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టపోయారని తెలిపారు.

193 రిలీప్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్​డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్ టీంలు రంగంలో దిగాయాని, ఆరు హెలికాఫ్టర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 228 బోట్లను రెస్క్యూ ఆపరేషన్​లో ఉన్నాయని తెలిపారు. 317 గజ ఈతగాళ్లను రంగంలో దింపినట్టు ప్రభుత్వం వివరించింది.

ట్రాక్‌ మరమ్మతులు పూర్తి - విజయవాడ -హైదరాబాద్‌ మధ్య రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ - kazipet to Vijayawada Trains Cancel

వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారా?

వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రత్యేక పాయింట్‌ ఏర్పాటు చేశారు.

ఆహారం అందించే దాతలను కో-ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఐఏఎస్ మనజీర్‌కు అప్పగించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబరు ఏర్పాటు చేశారు. ధన సహాయం చేసే దాతలు ఆన్‌లైన్‌ చెల్లింపు ద్వారా ఈ క్రింద పేర్కొన్న బ్యాంక్ ఖాతాలకు జమ చేయవచ్చని అధికారులు తెలిపారు.

బ్యాంక్ ఖాతాల వివరాలు:

State Bank Of India:

A/c Name : CMRF
A/c Number : 38588079208
Branch: AP Secretariat
IFSC code : SBIN0018884

Union Bank of India:
A/c name : CM Relief Fund
A/c number : 110310100029039
Branch: AP Secretariat, Velagapudi.
IFSC code : UBIN0830798.

పొలాల నిండా బండరాళ్లు, ఇసుకు మేటలు - భారీ వర్షాలతో ఆనవాళ్లు కోల్పోయిన పంట పొలాలు - Flood Effect To Telangana Crops

మున్నేరు శాంతించినా కన్నీరే మిగిలింది - నీట మునిగిన ఇంట్లో బురదతో బాధితుల ఇబ్బందులు - Munneru Flood Effect

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.