ETV Bharat / state

ఏపీ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు - తొలిరోజు ఆరు షోలు, టికెట్‌ ధరలకు గ్రీన్‌సిగ్నల్‌ - AP Govt Devara Movie - AP GOVT DEVARA MOVIE

AP Govt on Devara Movie : జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టికెట్‌ ధరల పెంపు, తొలిరోజు ఆరు షోల నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమాకు ఏపీ ప్రభుత్వం మద్దతును ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు.

Jr. NTR About AP Govt on Devara Movie
AP Govt on Devara Movie (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2024, 2:23 PM IST

Updated : Sep 21, 2024, 2:52 PM IST

Jr. NTR About AP Govt on Devara Movie : దేవర చిత్ర విడుదలను ప్రోత్సహించిన ఏపీ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేవర చిత్ర విడుదల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసిందని ఆయన తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేశ్​కు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాకు తన మద్దతును ఇలాగే కొనసాగించాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్ ప్రధానపాత్రల్లో నటించిన దేవర మూవీ విడుదలకు ఏపీలో అన్ని రకాల అనుమతులు లభించాయి. దేవర సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని అన్ని సినిమా హాళ్లలో బాల్కనీ టికెట్ ధర రూ.110 కి, దిగువ క్లాస్ టికెట్ ధరలు రూ.60 మేర పెంచుకుందుకు అనుమతి మంజూరు చేశారు. మొత్తం 9రోజుల పాటు స్పెషల్‌ షోలు ప్రదర్శనకు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రోజుకు ఆరు షోల చొప్పున ప్రదర్శించుకోవచ్చని ఉత్తర్వుల్లో తెలిపారు.

Jr. NTR About AP Govt on Devara Movie
దేవర చిత్ర విడుదల కోసం జీవో (ETV Bharat)

ఫస్ట్ డే అర్ధరాత్రి ఒంటి గంట షో : ఈ నెల 27వ తేదీన దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తారక్ అభిమానులకు శుభవార్త చెప్పింది. సాధారణంగా ప్రధాన హీరోల సినిమాల రిలీజ్ టైమ్‌లో ప్రీమియర్‌ షోస్ ప్రదర్శిస్తుంటారు. అదే విధంగా మొదటివారం టికెట్‌ ధరల పెంపునకు కూడా ఆయా ప్రభుత్వాలు అనుమతిని ఇస్తుంటాయి. ఈ మేరకు 'దేవర' మూవీ టీమ్ కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కలిసి స్పెషల్‌ షోలు, టికెట్‌ ధరల పెంపునకు పర్మిషన్‌కు అప్లై చేశారు. అందుకు ఆంధ్రప్రదేశ్‌ అధికారులు సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇక ఫస్ట్ డే అర్ధరాత్రి ఒంటి గంట షో వేయనున్నారు. అలాగే ప్రధాన హాల్స్‌లో తొలిరోజు ఆరు ఆటలను, మిగతా 9 రోజుల పాటు 5 షోలను ప్రదర్శిస్తారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల్లో దేవర అంచనాలను మించింది. నైజాం ప్రాంతంలో 'దేవర' టికెట్లు రూ.45 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. గతంలో కూడా ఎన్టీఆర్‌ నటించిన పలు చిత్రాలు నైజాం ఏరియాలో భారీగానే కలెక్షన్లను రాబట్టాయి. ఈ క్రమంలో ఈ సారి నైజాంలో రూ.50 కోట్ల షేర్ వస్తుందని ట్రేడ్ వర్గాల లెక్క. సీడెడ్‌లో కూడా రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. సుమారు రూ.25 కోట్ల షేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జూనియర్ ఎన్​టీఆర్ మల్టీ ట్యాలెంట్​ - 'దేవర' కోసం ఏకంగా 4 భాషల్లో! - Devara Special Interview

Last Updated : Sep 21, 2024, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.