ETV Bharat / state

రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - వందల కోట్లతో నాలుగు వరుసల రోడ్లు - ROADS EXPANSION IN PALNADU DISTRICT

పల్నాడు ప్రాంత పురోగతిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ - పేరేచర్ల-కొండమోడు, వినుకొండ- గుంటూరు మధ్య నాలుగు లైన్ల నిర్మాణం

Government Focused On Expansion Of Roads In Palnadu District
Government Focused On Expansion Of Roads In Palnadu District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2024, 5:01 PM IST

Government Focused On Expansion Of Roads In Palnadu District : రహదారులు లాంటి కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పల్నాడులోని అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం పల్నాడు ప్రాంత పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే కేంద్రాన్ని ఒప్పించి పేరేచర్ల-కొండమోడు 4 లైన్ల రహదారి, వినుకొండ-గుంటూరు 4 లైన్ల రహదారితోపాటు మాచర్ల నియోజకవర్గంలో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చేయడంలో విజయం సాధించింది.

రహదారుల నిర్మాణానికి కేంద్రం నిధులు : పల్నాడు ప్రాంతానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నాణ్యమైన ఖనిజ సంపదతో పాటు పక్కనే నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం పల్నాడు జిల్లా అట్టడుగున ఉంది. యువత ఉపాధి లేక నిరుద్యోగంతో, ప్రజలు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు, నీరు అందుబాటులో ఉన్నా రవాణా సదుపాయం అవరోధంగా మారింది. కూటమి ప్రభుత్వం పల్నాడు జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే మౌలిక వసతుల్లో కీలకమైన రహదారుల నిర్మాణంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పేరేచర్ల-కొండమోడు మార్గంతోపాటు వినుకొండ-గుంటూరు 4 లైన్ల రహదారి, మాచర్ల నియోజకవర్గంలో 4 ప్రధాన రహదారుల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు సమకూర్చడంలో సఫలమైంది.

'సంక్రాంతి వరకు గుంతలు పూడ్చేస్తాం- దీపావళికి ఉచిత సిలిడర్​ అందుతుంది'

రూ. 881.61కోట్లకు దక్కించుకున్న గుత్తేదారు : పేరేచర్ల-కొండమోడు రహదారిని 49.9 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించేందుకు నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఈ రహదారిని భారత్‌మాల కింద ఎంపిక చేశారు. గతేడాది 1032.52కోట్ల అంచనాతో టెండరును రాజేంద్రసింగ్‌ బేంబూ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది. నిధులు విడుదల కాక విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ అంశంపై తాజాగా సమీక్షించిన రహదారులు, భవనాల శాఖ మంత్రి BC జనార్దన్ రెడ్డి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలసి భారత్‌మాల కింద ఉన్న రోడ్లను NHO కింద కొనసాగించాలని కోరారు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ, స్టాండింగ్‌ పైనాన్స్‌ కమిటీ అంగీకరించడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ప్రభుత్వం 1032.52కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా రూ. 881.61కోట్లకు గుత్తేదారు దక్కించుకున్నారు.

"రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టారు.పేరేచర్ల-కొండమోడు మధ్య నాలుగు లైన్ల రహదారికి రూ. 881.61కోట్లు కేటాయించారు. ఈ రోడ్డు పూర్తయితే తెలంగాణ - ఏపీ రాష్ట్రల మధ్య రాకపోకలు పెరిగి వ్యాపారస్తులకు లాభం చేకురుతుంది. అలాగే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది." - రాజశేఖర్, పేరేచర్ల వాసి

భూ సేకరణ ప్రక్రియ పూర్తి : గుంటూరు నుంచి హైదరాబాద్‌ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు మార్గాన్ని విస్తరించాలనేది దశాబ్దాల కల. ఈ మార్గం అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారితో కొండమోడు వద్ద అనుసంధానమై హైదరాబాద్‌ వెళ్లేవారికి అనుకూలం. గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతం వైపు వెళ్లేవారికి కీలక మార్గం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరేచర్ల వరకు జాతీయ రహదారిగా కేంద్రం గుర్తించింది. వైెఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్రం నిధులు మంజూరు చేసినా వివిధ కారణాలతో విడుదల కాలేదు. కూటమి ప్రభుత్వం నిధులు కోరగా కేంద్రం పచ్చజెండా ఊపింది.

ఈ మార్గం విస్తరణకు గుంటూరు, సత్తెనపల్లి ఆర్డీవోల పరిధిలో 234 హెక్టార్ల భూమి సేకరణ ప్రక్రియను జిల్లాల యంత్రాంగం పూర్తి చేసింది. మేడికొండూరులో 4 నుంచి 5 కిలోమీటర్లు బైపాస్, సత్తెనపల్లిలో 11 కిలోమీటర్ల బైపాస్‌ నిర్మిస్తారు. కొండమోడు-పేరేచర్ల 4 వరుసల రహదారి విస్తరణకు సంబంధించి ఇప్పటికే టెండరు ప్రక్రియ పూర్తయి గుత్తేదారును ఎంపిక చేశారు. భూసేకరణ ప్రక్రియ మొత్తం పూర్తయింది. రైతుల ఖాతాలకు నిధులు జమ చేసి పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు.

గుంటూరుకు మరో ఔటర్‌ రింగ్‌ రోడ్డులా ఆ రహదారి : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నాలుగు రోడ్ల అభివృద్ధికి కేంద్రం 117.75 కోట్లు మంజూరు చేసింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు, సత్రశాలను అనుసంధానం చేస్తూ ఆయా మార్గాలను విస్తరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ రహదారులకు అనుసంధానం చేయడం వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుతోపాటు రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో సిమెంట్‌ కర్మాగారాలు ఉండటంతో రోడ్డు రవాణా ద్వారా వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి సిమెంట్‌ సరఫరా అవుతోంది. ఈ క్రమంలో రోడ్ల ప్రాధాన్యం పెరిగింది.

మాచర్ల మీదుగా ప్రయాణించే నకిరేకల్‌ నుంచి ఏర్పేడు జాతీయ రహదారి, నడికుడి నుంచి మాచర్లకు ఉన్న జాతీయ రహదారిని అనుసంధానం చేసే మార్గాలకు నిధులు మంజూరయ్యాయి. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. వినుకొండ-గుంటూరు రెండు లైన్ల మార్గాన్ని 4 లైన్లుగా విస్తరించనున్నారు. గుంటూరుకు మరో ఔటర్‌ రింగ్‌ రోడ్డులా ఈ రహదారి అందుబాటులోకి రానుంది.

శరవేగంగా రహదారుల పనులు - భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం

పల్లె పరవశించేలా కొత్త రోడ్లు - పాతవాటి మరమ్మతుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం - NDA Govt Decision for New Roads

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.