ETV Bharat / state

"సెకి" పవర్ డీల్ - విద్యుత్‌ సర్దుబాటుకు డిస్కంల గారడీలు - SECI DEAL WITH AP GOVT

డిస్కంల వనరుల ప్రణాళికలో అడ్డగోలు లెక్కలు

Adani Bribe to YS Jagan
Adani Bribe to YS Jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 3:43 PM IST

Updated : Dec 9, 2024, 6:21 PM IST

SECI Deal With AP Govt : సెకి నుంచి కరెంట్​ను తీసుకోవాలని డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి. 2025-2026లో 4,191.27 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) విద్యుత్‌ తీసుకోనున్నట్లు వనరుల ప్రణాళికలో చూపాయి. ఏపీ రూరల్‌ అగ్రికల్చర్‌ పవర్‌ సప్లై కంపెనీ (ఏపీరాప్స్‌కామ్‌) పేరిట ఆ విద్యుత్‌ను డిస్కంలు వనరుల ప్రణాళికలో చేర్చాయి. ఆ సర్దుబాటు కోసం ప్రస్తుతం కరెంట్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) ద్వారా అందుతోన్న పవన, సౌర విద్యుత్‌ లెక్కలతో డిస్కంలు అంకెల గారడీ చేశాయి.

ఈ సంవత్సరంలో ముగిసే పీపీఏలు లేకున్నా వచ్చే ఏడాది పునరుత్పాదక విద్యుత్‌ 2,711 ఎంయూలు తగ్గుతుందని డిస్కంలు ప్రణాళికలో తెలిపాయి. ఆ కరెంట్​ను సర్దుబాటు చేసే వివరాలపై స్పష్టత ఇవ్వలేదు. సెకి (అదానీ) ఒప్పందంపై ముందుకు వెళ్లడం కోసం డిస్కంలు ఇలా చేశాయనే స్పష్టతకు వచ్చింది. సెకి విద్యుత్‌ ఒప్పందంలో ఓవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ముడుపులు అందాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆ డీల్​ వల్ల ప్రజలపై రూ.1.10 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా వాటిని లెక్కచేయకుండా ఒప్పందం అమలుకే డిస్కంలు మొగ్గుచూపాయి. 2025-2026 వనరుల ప్రణాళికలో ఆ విద్యుత్‌ను చేర్చాయి.

లెక్కలనే మార్చేసి : అదానీ కరెంట్​ను తీసుకునే విషయంలో డిస్కంలు వేసిన లెక్కలు మసిపూసి మారేడు కాయ చేసిన సామెతను తలపించేలా ఉన్నాయి. పీపీఏల ద్వారా వచ్చే విద్యుత్ లెక్కలనే మార్చేశాయి. సెకి నుంచి తీసుకునే విద్యుత్‌కు దాదాపు సరిసమానంగా 4428 మిలియన్‌ యూనిట్ల కరెంట్ సర్దుబాటుకు వివిధ సంస్థల నుంచి పీపీఏల ద్వారా తీసుకునే విద్యుత్‌నే కోత పెట్టాయి. ఆ లెక్కలు తర్వాత చేసుకుందామనే రీతిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

2025-2026లో రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా 84,390.3 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరం ఉంటుందని డిస్కంలు చెబుతున్నాయి. ఇప్పటికే వివిధ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏల మేరకు తీసుకోవాల్సిన విద్యుత్‌ పోను, ఇంకా ఎంత కరెంట్ అవసరం ఉంటుంది? ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలనే అంశాలతో డిస్కంలు వనరుల ప్రణాళికను రూపొందిస్తాయి. వచ్చే సంవత్సరం సరఫరా, పంపిణీ నష్టాలు 10.03 శాతంగా డిస్కంలు అంచనా మేరకు మొత్తం విద్యుత్‌లో సరఫరా నష్టాల కింద 8,464.08 ఎంయూలు పోను 75,926.22 ఎంయూల విద్యుత్‌ విక్రయించనున్నట్లు అంచనావేశాయి. సెకి నుంచి తీసుకునే విద్యుత్‌ సర్దుబాటుకు డిస్కంలు చాలా శ్రమ తీసుకున్నాయి.

  • ప్రస్తుత ఆర్థిక ఏడాది (2024-2025)లో వివిధ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి 81,025 మిలియన్ యూనిట్ల కరెంట్ కొనుగోలు చేయాలని డిస్కంలు భావించాయి. అందులో పవన, సౌర ఇతర పునరుత్పాదక వనరుల ద్వారా తీసుకునే విద్యుత్‌ 17,578 మిలియన్ యూనిట్లు.
  • వచ్చే సంవత్సరం (2025-2026) డిమాండ్‌ పెరుగుదల కారణంగా అదనంగా అవసరమయ్యే 3,365.3 మిలియన్ యూనిట్లతో కలిపి మొత్తం 84,390.3 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ అవసరమని అందులో పునరుత్పాదక విద్యుత్‌ 14,866.96 ఎంయూలుగా చూపాయి. ప్రస్తుత ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2711.04 ఎంయూలు తక్కువ.
  • విద్యుత్‌ స్వాపింగ్‌ కింద 473.86 మిలియన్ యూనిట్లను డిస్కంలు చూపాయి. డిమాండ్‌ తక్కువగా ఉన్న సమయంలో ఇతర రాష్ట్రాలకు ఇచ్చి మనకు అవసరమైన సమయంలో ఆ కరెంట్ తీసుకోవడాన్ని స్వాపింగ్‌ అంటారు. ఇచ్చిన విద్యుత్‌ తిరిగి వచ్చినట్లు చూపలేదు.
  • స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా వచ్చే ఏడాది 816.08 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలు చేస్తామని చెప్పాయి. ఈ సంవత్సరం 1,036 ఎంయూలను బహిరంగ మార్కెట్‌లో కొనాలని డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి.
  • సెంబ్‌కార్ప్‌తో 625 మెగావాట్ల విద్యుత్‌ ఒప్పందం కుదుర్చుకోవాలన్న ప్రతిపాదన ఉంది. ఆ మేరకు థర్మల్‌ విద్యుత్‌ పెరగాల్సి ఉంది. కానీ ఈ సంవత్సరం ఆ సంస్థ నుంచి 9167 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ తీసుకునేలా ప్రతిపాదిస్తే వచ్చే ఏడాది 8144.06 ఎంయూలు మాత్రమే తీసుకోనున్నట్లుగా చూపారు. సుమారు. 1023 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను తగ్గించి చూపడానికి కారణమేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుండగా అదానీ నుంచి కొనే కరెంట్ కోసం విద్యుత్‌ లెక్కల్లో కోత పెట్టారనే మాట వినిపిస్తోంది.

అంతా లెక్కల గారడీ - అదానీ విద్యుత్‌ కొనడం కోసం వైఎస్సార్సీపీ కుట్రలు

మేమింతే - సెకి డీల్​పై జగన్‌ ప్రభుత్వ వింత వాదన!

Last Updated : Dec 9, 2024, 6:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.