Govt Employees Code Violation : ప్రభుత్వం నుంచి జీతభత్యాలు అందుకునేవారు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం పదే పదే చెబుతున్నా కొందరి చెవికి ఎక్కడం లేదు. మునిగిపోయే నావలాంటి వైకాపా సేవలో తరించడం మానడం లేదు. ఆ పార్టీ అభ్యర్థులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ గులాంగిరి చేయడం ఆపడం లేదు. ప్రకాశం జిల్లాల్లో కొందరు ఉద్యోగుల ప్రవర్తన మూలంగా మొత్తం యంత్రాంగమే చెడిపోయిందన్న భావన కలిగేలా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు తాజా ఊదాహరణ భువనగిరి వెంకట సుబ్బయ్య అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి మరో నిదర్శనం.
వైఎస్సార్సీపీ నాయకులకు తొత్తులుగా ప్రభుత్వ ఉద్యోగులు - చర్యలకు ప్రతిపక్షాల డిమాండ్
కొండేపి మండలంలోని పోలిరెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా వెంకట సుబ్బయ్య విధులు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ అంటే మక్కువ. ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. గతంలో పాఠశాలకు సెలవు పెట్టి మరీ ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనేవారని గ్రామస్థులు చెబుతుంటారు. ఇటీవల పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో ఆయనకు మరింతగా రెక్కలొచ్చినట్లైంది. నిత్యం వైకాపా నాయకులు, వారి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొండపి నియోజకవర్గ అభ్యర్థి ఆదిమూలపు సురేష్‌కు చెందిన సింగరాయకొండలోని కార్యాయలం వద్ద ప్రచార పర్వంలో కనిపించారు. కార్యాలయంలోనే గంటల కొద్దీ ఉంటూ వస్తూ పోతున్న నాయకులకు సలహాలు, సూచనలు ఇస్తూ వెంకటసుబ్బయ్య వైఎస్సార్సీపీ సేవలో తరిస్తున్నారు. గ్రామంలో జరిగే వైఎస్సార్సీపీ ప్రచార కార్యక్రమంలో తరుచూ పాల్గొనే వ్యవహారం గతంలోనే ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఒకటి రెండు సార్లు వెంకటసబ్బయ్యను ఈ విషయమై మండల విద్యాధికారి మందలించారని సమాచారం.
ఉద్యోగ సంఘాల బాధ్యత రాహిత్యంతోనే సమస్యలు అపరిష్కృతం
ఇటీవల ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కానిస్టేబుల్ వ్యవహారం మరిచిపోక ముందే వెంకటసుబ్బయ్య ఇలా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ప్రత్యక్షం కావటం కొందరి ఉద్యోగుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. పత్రికల్లో వార్తలు వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్‌లో పాల్గొన్న కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ విధుల నుంచి తప్పించారు. ఇలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్న కొందరి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. స్వలాభం, స్వార్థం కోసం కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తే ఇలాంటి చర్యల మూలంగా మొత్తం వ్యవస్థనే సామాన్యులు తప్పుపట్టే పరిస్తితి ఉంది.
వైఎస్సార్సీపీ నాయకులకు తొత్తులుగా ప్రభుత్వ ఉద్యోగులు - చర్యలకు ప్రతిపక్షాల డిమాండ్