ETV Bharat / state

గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చారు : అల్లుఅర్జున్ వివాదంపై పవన్ - PAWAN KALYAN ON ALLU ARJUN ISSUE

అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన ఏపీ ఉపముఖ్యమంత్రి - సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని వ్యాఖ్య - తన పేరు చెప్పలేదని అలా చేశారని అనుకోవట్లేదన్న పవన్ కల్యాణ్

Pawan Kalyan On Allu Arjun Issue
Pawan Kalyan On Allu Arjun Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2024, 1:00 PM IST

Updated : Dec 30, 2024, 6:36 PM IST

AP Dy CM Pawan Kalyan On Allu Arjun Issue : అల్లు అర్జున్​ వివాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్ స్పందించారు. గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారని అన్నారు. తెలంగాణ ఫిల్మ్​ డెవలప్​మెంట్​ ఛైర్మన్​ దిల్​రాజు పవన్​ కల్యాణ్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్​ కల్యాణ్​ మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడని పవన్​ కల్యాణ్ అన్నారు. ఆయన కిందిస్థాయి నుంచి ఎదిగారని అన్నారు.

వైఎస్సార్​సీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బెనిఫిట్​ షోలకు రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారని గుర్తు చేశారు. టికెట్​ ధరలు పెంపునకు కూడా అవకాశం కల్పించారని పవన్​ కల్యాణ్​ అన్నారు. అభిమాని చనిపోతే వెంటనే పరామర్శకు వెళ్లి ఉండాల్సిందని పవన్​ అభిప్రాయపడ్డారు. అల్లు అర్జున్​ కాకున్నా కనీసం నిర్మాతలైనా వెళ్లి ఉండాల్సిందన్నారు.

" గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు. రేవంత్‌ రెడ్డి గొప్ప నాయకుడు. కిందిస్థాయి నుంచి ఎదిగారు. వైఎస్సార్​సీపీ విధానాల తరహాలో తెలంగాణలో వ్యవహరించలేదు. రాష్ట్రంలో బెనిఫిట్‌ షోలకు అవకాశం ఇచ్చారు. టిక్కెట్‌ ధర పెంపునకు అవకాశమిచ్చారు. అల్లు అర్జున్ విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. తెర ముందు, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఇలాంటి ఘటనల్లో నేను పోలీసులను తప్పుపట్టను" - పవన్​ కల్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం

అందరూ రేవతి ఇంటికి వెళ్లి పరామర్శించి ఉండాల్సింది : అల్లు అర్జున్ విషయంలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్​ కల్యాణ్​ అన్నారు. అందరూ రేవతి ఇంటికి వెళ్లి భరోసా ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పరామర్శించకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం వచ్చిందని తెలిపారు. పుష్ప సినిమాకు సీఎం రేవంత్‌ రెడ్డి సహకరించారన్నారు. పుష్ప టిక్కెట్‌ రేట్లు పెంచారని, బెనిఫిట్‌ షోకు అవకాశమిచ్చారని గుర్తు చేశారు. సీఎం హోదాలో రేవంత్‌ రెడ్డి స్పందించారని పవన్​ కల్యాణ్​ తెలిపారు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని ఆయన తెలిపారు. రేవంత్‌ చాలా డైనమిక్ లీడర్​ అన్న ఆయన, తెలంగాణ సీఎం సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయని గుర్తు చేశారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సాఫ్ట్‌గా వెళ్లి ఉంటే బాగుండేదని పవన్​ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

అల్లు అర్జున్​ అరెస్ట్​ వ్యవహారంపై పవన్​ కల్యాణ్​ రియాక్షన్​ ఇదే

అల్లు అర్జున్ బెయిల్‌ పిటిషన్‌ - తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

Last Updated : Dec 30, 2024, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.